BigTV English

Covid Cases: ఆ రెండు దేశాల్లో కొవిడ్ కేసుల పెరుగుదల.. భారత్ పరిస్థితి ఏంటి..?

Covid Cases: ఆ రెండు దేశాల్లో కొవిడ్ కేసుల పెరుగుదల.. భారత్ పరిస్థితి ఏంటి..?

హాంకాంగ్ లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి..
సింగపూర్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది..
మరి మన భారత్ సంగతేంటి..?
కొవిడ్ కేసులు మళ్లీ పెరిగితే, దాని ప్రభావాన్ని తగ్గించడానికి మనం ఏమేరకు సన్నద్ధతతో ఉన్నాం..?
అసలు కొత్త వైరస్ పేరేంటి..? దానికి భారత్ లో టీకా ఉందా..?
ఇప్పుడు తెలుసుకుందాం..


మరింత అప్రమత్తత అవసరం..
చైనాలో మొదలైన కొవిడ్ ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. కొవిడ్ మొదటి దశ, రెండో దశ తీవ్ర ప్రభావం చూపించిన తర్వాత దాని ప్రభావం దాదాపుగా తగ్గిపోయిందనే చెప్పాలి. అక్కడక్కడ కొవిడ్ లక్షణాలున్న పేషెంట్లు ఉన్నా కూడా వారి వల్ల ఇతరులకు పెద్దగా ప్రమాదం లేకుండా పోయింది. కొవిడ్ వైరస్ ని తట్టుకునే రోగనిరోధక శక్తి అందరికీ సమకూరడం, వ్యాక్సిన్ల ప్రభావంతో దాదాపుగా కొవిడ్ కష్టాలు తొలగిపోయాయనే అనుకున్నాం. కానీ అది మహమ్మారి, దాని ప్రభావం తగ్గొచ్చు కానీ, పూర్తిగా అంతమయ్యే పరిస్థితి లేదు. అందుకే అది మళ్లీ వచ్చింది. ఈసారి పేరు మార్చుకుని విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్ ని చుట్టేసింది. ఇప్పటి వరకు భారత్ లో కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్టు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కానీ ఆ పరిస్థితే వస్తే మనం మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు.

కొత్త లెక్కలు ఇవే..
సింగపూర్ లో కొవిడ్ కేసులు ఒక్క వారంలోనే 3,200 పెరిగాయి. గత వారం 11వేలు కాగా, ఆ తర్వాత 14,200కి చేరాయి. సగటున ప్రతి రోజూ కొవిడ్ బారిన పడి ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 102 నుంచి 133కి పెరిగింది. కానీ వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఐసీయూ వంటి సీరియస్ సిచ్యుయేషన్ కి చేరుకుంటున్నారు. 133మందిలో సగటున ఇద్దరు మాత్రమే కొవిడ్ వైరస్ ధాటిని తట్టుకోలేక పోతున్నారు. వారిని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


కొత్త వేరియంట్..
కొవిడ్ లో చాలా వేరియంట్లు మనకు తెలుసు. అందులో అత్యధిక హాని కలిగించేవి, పెద్దగా ప్రభావం చూపనివి కూడా ఉన్నాయి. తాజాగా సింగపూర్ లో వ్యాపిస్తున్న వేరియంట్ లు LF.7, NB.1.8 గతంలో విజృంభించిన JN.1 కి కొనసాగింపుగా ఇవి అవతరించాయి. అయితే వీటికోసం కొత్త టీకాలేవీ అందుబాటులో లేవు. దీంతో కొవిడ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సింగపూర్, హాంకాంగ్ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. జనాభాలో కొవిడ్ రోగనిరోధక శక్తి తగ్గడం, కొంతమంది వృద్ధులు బూస్టర్ షాట్ లు తీసుకోకపోవడంతో ముందుగా కొత్త వేరియంట్ వారిని అటాక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొత్త వేరియంట్ లు తీవ్ర ప్రభావాన్ని చూపేవి కావని, అదే సమయంలో వ్యాప్తి కూడా తక్కువగానే ఉంటుందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది.

భారత్ లో కూడా కొవిడ్ పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. లాక్ డౌన్ ప్రభావం మనపై అంతగా నిలబడిపోయింది మరి. వ్యాక్సినేషన్ మొదలయ్యాక ప్రజల్లో భయాందోళనలు తొలగిపోయాయి. మళ్లీ కొత్తగా కేసులు అంటుంటే మాత్రం భారతీయులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటి వరకు మన దగ్గర కొత్త వేరియంట్ జాడ లేదు. విదేశాలనుంచి వస్తున్నవారి విషయంలోముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని ప్రభుత్వం ఇంకా తప్పనిసరి చేయలేదు. ముందు ముందు ఇవన్నీ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×