BigTV English

Jabardast Rohini : లగ్జరీ విల్లా కొన్న రోహిణి.. స్టార్స్ పనికిరారు.. ఎన్ని కోట్లో తెలుసా..?

Jabardast Rohini : లగ్జరీ విల్లా కొన్న రోహిణి.. స్టార్స్ పనికిరారు.. ఎన్ని కోట్లో తెలుసా..?

Jabardast Rohini : బుల్లితెర పై టాప్ కామెడీ షో అంటే జబర్దస్త్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ షో ద్వారా ఎంతోమంది బుల్లితెర నుంచి వెండితెరకు కమెడియన్లుగా పాపులర్ అయ్యారు. జెంట్స్ మాత్రమే కాదు లేడీస్ కూడా ఈ షో ద్వారా స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.. అలాంటి వారిలో రోహిణి కూడా ఒకటి.. తన మార్కు కామెడీతో జబర్దస్త్ నవ్విస్తూ క్రేజ్ ని సంపాదించుకుంది. అదేవిధంగా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రోహిణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నా మధ్య కారు కొన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఇప్పుడేమో ఏకంగా లగ్జరీ విల్లాను కొన్నది. ఆ విల్లా ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారడంతో సోషల్ మీడియాలో రోహిణి పై పెద్ద చర్చ నడుస్తుంది. అన్ని కోట్ల విలువైన విల్లాను జబర్దస్త్ సినిమాలతోనే కొనేసిందా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. మరి దీనిపై రోహిణి రియాక్ట్ అయిందేమో ఒకసారి మనం తెలుసుకుందాం..


కోట్ల విలువైన విల్లాను కొన్న రోహిణి..

ఈమధ్య సినీ ఇండస్ట్రీలోని తారలతో పాటు.. బుల్లితెరపై నటిస్తున్న వాళ్లు కూడా గృహప్రవేశాలు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ రోహిణి కూడా ఓ ఖరీదైన విల్లా కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.. కమెడియన్ గా రోహిణి తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకుంటూ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం బుల్లితెరపై వెండి తెరపై హవాని కొనసాగిస్తుంది.


ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వస్తుంది. అయితే రోహిణి ఎప్పుడూ లగ్జరీ గా ఉండాలని కోరుకుంటుంది. మొన్న తన పేరెంట్స్ తో కలిసి ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఇప్పుడు ఏకంగా మరో కాస్ట్లీ విల్లాను కొన్నది.. హైదరాబాద్ నగర శివార్లలోని కొంగర కలాన్‌లో ఓ లగ్జరీ విల్లాను కొన్నారు. ఆ విల్లా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్లు కూడా అంత లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు. రోహిణి మాత్రం కోట్లు ఖరీదు చేసే విధానం కొనుగోలు చేయడంపై కొందరు పెదవిరుస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అన్ని సదుపాయాలు కలిగిన ఆ విల్లా ఖరీదు దాదాపు రెండు కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ వీడియో పై కొందరు సెలబ్రిటీలు స్పందిస్తూ రోహిణికి కంగ్రాట్స్ చెప్తున్నారు.

సినిమాల్లోనూ బిజీగా రోహిణి.. 

కమెడియన్ రోహిణి మొదట సీరియల్స్లలో నటించి పాపులర్ అయింది.. ఆ తర్వాత తన టాలెంట్ తో బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్లలో నటించింది. జబర్దస్త్ లోనూ,సినిమాల్లోనూ వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రస్తుతం బిజీగా గడుపుతుంది. అప్పట్లో టిక్‌టాక్‌, డబ్‌స్మాష్‌లో కామెడీ రీల్స్, వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది.. రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా పాల్గొంది. జబర్దస్త్ తో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..

?igsh=YzhlbzB5dTczd2xp

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×