BigTV English

Alekhya Pickles : సిస్టర్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు… ట్రాన్స్ అనే కామెంట్ కి దిమ్మతిరిగే ఆన్సర్..

Alekhya Pickles : సిస్టర్స్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు… ట్రాన్స్ అనే కామెంట్ కి దిమ్మతిరిగే ఆన్సర్..

Alekhya Pickles : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పీకేల్స్ పేరు తెగ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. పచ్చల ధర ఎక్కువ అన్నందుకు ఓ కస్టమర్ పై దారుణంగా తిట్టారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ధర అడిగితే ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ బూతులు తిట్టాలా అంటూ నెటిజన్లు కూడా వార్తలకు ఆద్యం పోసేలా కామెంట్లు పెట్టడంతో ఒక్కసారిగా అలేఖ్య సిస్టర్స్ సెలబ్రిటీలు గా మారారు. ఇక వీరి గురించి ఏ చిన్నది వచ్చినా కూడా ఇట్లే వైరల్ గా మారుతుంది. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో అలేఖ్య పీకిల్స్ సిస్టర్స్ ట్రెండ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళ పోస్ట్ కి వచ్చిన కామెంట్ పై స్పందించారు. ప్రస్తుతం ఇది మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ వాళ్లు పెట్టిన పోస్ట్ ఏంటి? వచ్చిన కామెంట్లు ఏంటి? అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


మరోసారి వార్తల్లోకి అలేఖ్య సిస్టర్..

ఏపీలోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో తమకున్న క్రేజీని ఉపయోగించుకొని ఈ పచ్చల బిజినెస్ ని మొదలుపెట్టిన అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిపోయారు. అయితే రీసెంట్ గా ఓ కష్టమని బూతులు తిట్టడం పై నెటిజన్లు మండిపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అవడం కస్టమర్ కి క్షమాపణలు చెప్పడం అన్ని రోజుల వ్యవధిలోనే పూర్తయిపోయాయి. అయితే అంత సద్దుమణిగిందా అనుకునే లోపల ఇప్పుడు మరోసారి అలేఖ్య పీకిల్స్ పేరు వార్తల్లో వినిపిస్తుంది.. అలేఖ్య ఒక ఫోటో పెట్టింది. ఆ ఫోటోని చూసిన ఓ నెటిజన్ ట్రాన్స్ జెండర్ నా అని కామెంట్స్ పెట్టారు. దానికి ఆమె దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్పింది.. నేను ట్రాన్స్ జెండర్ అయితే నీకేంటి ప్రాబ్లం అని రిప్లై ఇచ్చింది.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.. అది చూసిన కొంతమంది బాగా బుద్ధి చెప్పావని అలేఖ్యకు సపోర్ట్ చేస్తున్నారు.


Also Read :నా కథలతో సినిమాలు తీశారు.. నమ్మించి జీవితం మీద కొట్టారు..

అలేఖ్య చిట్టి పీకేల్స్ స్టోరీ.. 

రాజమండ్రికి చెందినచిట్టి.. అలేఖ్య.. రమ్య.. ముగ్గురు అమ్మాయిలు.. అక్కచెల్లెళ్లు.. సోషల్ మీడియా ఇన్ఫలెన్సర్లు కూడానూ.. బాగా ఫాలోవర్స్ ఉన్నోళ్లు.. సోషల్ మీడియాతో ముగ్గురు అమ్మాయి పచ్చళ్ల వ్యాపారం మొదలెట్టారు.. పేరు ఏంటో తెలుసా అలేఖ్య చిట్టి పికిల్స్.. నాన్ వెజ్ పికిల్స్.. పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్లు అన్నమాట.. టైటిల్ బాగానే ఉంది.. వ్యాపారం కూడా బాగానే పెట్టారు. పబ్లిసిటీ కావాలి కదా.. అందులోనూ సోషల్ మీడియా ఇన్పులెన్సర్లు.. సో స్ట్రాటజీ ఉపయోగించారు.. మీ అలేఖ్య చిట్టి పికిల్స్ తినటం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది.. ఈ ఒక్క కామెంట్ ద్వారా ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చేసింది. అలా సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ పెరగడంతో పచ్చల బిజినెస్ ఒక్కసారిగా ఆకాశానికి ఎక్కింది. బిజినెస్ స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే పాపులర్ అయిపోవడంతో ఈ ముగ్గురు సిస్టర్స్ పేరు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయింది. ఇటీవల ఓ కష్టమని బూతులు తిట్టిన నేపథ్యంలో మళ్లీ వార్తల్లో ఫేమస్ అయ్యింది అలేఖ్య చిట్టి పీకేల్స్. ఇప్పటివరకు ఏదో ఒక సందర్భంలో వీరి పేర్లు వార్తల్లో నిలుస్తున్నాయి..

https://www.facebook.com/share/p/19EeHE63BZ/

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×