Youtuber Madhumita: యూట్యూబర్ మధుమతి మృతి వెనుక ఏం జరిగింది? ఆమెది హత్యా? ఆత్మహత్యా? యువకుడితో ఏర్పడిన పరిచయం ఆమె ప్రాణం తీసిందా? యువతి మృతి వెనుక వివాహేతర సంబంధమే కారణమా? తమ కూతురి మృతి వెనుక ప్రతాప్ ప్రధాన కారణమని తల్లిదంద్రులు ఎలా చెబుతున్నారు? పోలీసుల విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అసలేం జరిగింది?
పోలీసులు కథనం ప్రకారం.. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఏ కొండూరు గ్రామానికి చెందిన 22 ఏళ్ల మధుమతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. కాసింత అందంగా ఉండడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం మొదలు పెట్టింది.రోజురోజుకూ తన రీల్స్ ఫాలోవర్స పెరగడం గమనించింది. ఈలోగానే ఆమెకు సపరేట్‌గా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. ఆ విధంగా లక్షల్లో సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుంది.
ఏం జరిగిందో తెలీదు. కాకపోతే మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. చేతికి అందివచ్చిన కూతురు ఈ లోకాన్ని విడిచి పెట్టడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మా కూతురు ఆత్మహత్యకు ప్రతాప్ కారణమని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. అతడ్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఎవరీ ప్రతాప్?
మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మధుమతి ఉరి వేసుకోవడానికి కారణం ఏంటి? ఆమెకు ఎలాంటి అవసరం లేదా కష్టం వచ్చింది? తమ కూరుతు చావుకు తెల్లదేవరపల్లి ప్రాంతానికి చెందిన ప్రతాప్ కారణమని ఎందుకు అంటున్నారు? మధుమతి చంపి, ఉరేశాడని మధుమిత తల్లిదండ్రులు పాపారావు-లావణ్య దంపతుల మాట.
ALSO READ: అడ్రస్ చెబుతామని నమ్మించి, భర్త ఎదురుగానే భార్యపై అత్యాచారం
లోతుగా దర్యాప్తు
ప్రతాప్‌తో మధుమతి క్లోజ్‌గా ఉండడం ఆమె ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని అంటున్నారు పేరెంట్స్. దీనిపై మధుమతిని హెచ్చరించామని అంటున్నారు. దీనిపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయే ముందు ఎవరితో మాట్లాడింది?
ఎవరితో ఛాటింగ్ చేసింది? ప్రతాప్‌తో ఎంత సేపు మాట్లాడింది? ఫోన్ డేటా ద్వారా సేకరిస్తున్నారు పోలీసులు. మరోవైపు మధుమతి పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేసిన ప్రతాప్‌ను విచారించాలని భావిస్తున్నారు. మొత్తానికి మధుమతిది హత్యా? ఆత్మహత్యా అనేది తేల్చేపనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.