Bullet Bhashkar : బుల్లితెర పై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న ఏకైక షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతో మంది లైఫ్ మారింది. వారానికి ఒకసారి వచ్చే ఈ షో కోసం చాలామంది బుల్లితెర ప్రేక్షకులు తెగ ఎదురుచూసేవారు. ఈ షో వల్ల ఎంతోమంది కామెడియన్ల, యాంకర్లు, ఆఖరికి జడ్జిలు కూడా లాభం పొందారు. అందులో బుల్లెట్ భాస్కర్ కూడా ఒకడు. షో స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్ని మార్పులు జరిగినా జబర్దస్త్‌ను వదలని కామెడియన్స్‌లో భాస్కర్ కూడా ఒకడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా భాస్కర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.. ఇందులో ఎన్నో కీలక విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది.
జబర్దస్త్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టిన భాస్కర్..
బుల్లితెరపై సక్సెస్ టాక్ తో దూసుకుపోతున్న ఏకైక షో జబర్దస్త్.. ఈ షోలో ఎంతోమంది కమెడియన్లు తమ టాలెంట్ నే నిరూపించుకొని ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుంటూ బిజీ అయిపోయారు. కొందరేమో ఏకంగా సినిమాలను నిర్మించడం సినిమాలకు దర్శకత్వం చేయడం వంటివి చేస్తున్నారు. ఈ షోలో తన కామెడీ స్టాండప్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించినా బుల్లెట్ భాస్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో టాలెంట్ ఉంది కూడా జబర్దస్త్ లో మాత్రమే అయినా కొనసాగిస్తున్నారు అన్న విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన భాస్కర్ జబర్దస్త్ లో జరుగుతున్న విషయాల గురించి షేర్ చేసుకున్నారు. నా టాలెంట్ ని గుర్తించి నాకు జబర్దస్త్ మంచి అవకాశం ఇచ్చింది నేను ఇన్నేళ్లుగా జబర్దస్త్ ని వీడలేదు అని భాస్కర్ అన్నారు. అంతేకాదు జబర్దస్త్ లో కమెడియన్ గా కొనసాగుతున్న నటన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. అంతేకాదు తనని సినిమాల్లో రానివ్వకుండా తొక్కేసారంటూ భయంకరమైన నిజాన్ని బయట పెట్టాడు.
Also Read :గద్దర్ అవార్డ్స్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్.. అలా అనేసారేంటి?
నన్ను నమ్మించి మోసం చేశారు..
బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మన నీడను కూడా మన నమ్ముకోవడానికి వీల్లేదు ఎవరు ఎప్పుడు మోసం చేస్తారో చెప్పడానికి కష్టమే అంటూ జబర్దస్త్ లో నీకు కొందరి గురించి కీలక విషయాలను బయటపెట్టారు. ఇంటర్వ్యూలో యాంకర్ సినిమాల్లోకి రావాలని, సినిమాలు చేయాలని మీకు అనిపించట్లేదా అని అడిగారు.. దానికి భాస్కర్ సమాధానం చెబుతూ.. సినిమా స్టోరీ రాసి డైరెక్ట్ చేసే అంత కెపాసిటీ నాకుంది. కొందరు నా కథలను విని వాటిని దొబ్బేసారు నాకు అన్యాయం చేశారు అందుకే కొందరిని నమ్మాలంటే నేను చాలా ఆలోచిస్తాను అని భాస్కర్ అన్నారు. అంతేకాదు చిరంజీవి గారితో సినిమా చేయాలని నా కోరిక.. అదృష్టం బాగుంటే ఆ కోరిక తీరుతుంది ఏమో చూడాలని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. మొత్తానికి ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది..