Sankranthi Kodi Pandalu Viral Video: సంక్రాంతి వచ్చిందంటే.. ఏపీలో సందడి మామూలుగా ఉండదు. మూడు రోజుల పాటు పల్లెలన్నీ బంధు మిత్రులతో కళకళలాడుతాయి. దేశంలో ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా, ఉపాధి కోసం వెళ్లినా, సంక్రాంతి వచ్చిదంటే ఊరికి రావాల్సిందే! మూడు రోజులు ఎంజాయ్ చేయాల్సిందే! ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసు గీతాలు ఆహా అనిపిస్తాయి. కోడి పందాల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. సంక్రాంతి అంటేనే కోడిపందాలు. ఈ మూడు రోజుల పాటు ఏ ఊళ్లో చూసినా కోడి పందాలే కనిపిస్తాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. కోడి పందాలపై నిషేధం ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ప్రజలు తమ సంతోషం కోసం ఆడుతూనే ఉంటారు.
కాలు కదపకుండా 5 పందాలు గెలిచిన కోడిపుంజు
ఇక తాజాగా ఏపీలో జరిగిన సంక్రాంతి కోడి పందాలకు సంబంధించి బోలెడు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఏపీకి చెందిన వాళ్లంతా కోడి పందాలు ఆడే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికాగా షేర్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియోలు అన్నింటితో పోల్చితే ఓ కోడి పందానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటంటే, నిల్చున్న దగ్గరి నుంచి కాలు కదపకుండా 5 పందాలను గెలిచి విజేతగా నిలిచింది. కాలు కదపకుండా పందాలు గెలవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఔను మీరు విన్నది నిజమే. ఓ పందెంలో భాగంగా 5 పుంజులను బరిలోకి దింపారు. అయితే, వీటిలో మిగతా నాలుగు కోడి పుంజులు ఒకదానికొకటి కొట్లాడి ప్రాణాలు కోల్పోయాయి. ఓ కోడి పుంజు మాత్రం సైలెంట్ గా నిలబడి పోటీలో విన్నర్ గా నిలిచింది. ఈ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గొడవల్లో తలదూర్చకపోవడం వల్ల ఎంత మేలు కలుగుతుందో చూడండి అని కామెంట్స్ పెడుతున్నారు.
గొడవలు జరుగుతున్నప్పుడు సైలెంట్‌గా ఉండడం కన్నా మేలైన మార్గం ఇంకోటి ఉండదు..
కాలు కదపకుండా ఐదు కోళ్ల పందెం గెలిచిన పుంజు…#cockfight #sankranthi pic.twitter.com/ihp0c97J1o— Swathi Reddy (@Swathireddytdp) January 15, 2025
చేతుల మారిన కోట్లాది రూపాయలు
ఒకప్పుడు కోడిపందాలు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా పాకాయి. ప్రతి ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం ఏకంగా పలు చోట్ల పంటపొలాలలను కూడా చదును చేసి కంచెలు వేశారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కోడి పందాలకు వచ్చే వారి కోసం కూల్ డ్రిండ్స్, ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటయ్యాయి. ఈసారి కోడి పందాలు జరిగే ప్రాంతాల్లో బెల్ట్ షాపులు కూడా వెలిశాయి. ఇక కోడిపందాలు చూడ్డమే కాదు, ఆడటం కోసం ఏపీకి పలు ప్రాంతాల ప్రజలు వచ్చారు. హైదరాబాద్ బెంగళూరు, చెన్నైతో పాటు పలు ప్రాంతాల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. మూడు రోజుల పాటు కోడి పందాల్లో పాల్గొని డబ్బులు సంపాదించడంతో పాటు ఆంధ్రా సంక్రాంతి సంబురాలను ఎంజాయ్ చేశారు.
Read Also: సంక్రాంతికి ఊరెళ్లిన వారే టార్గెట్, ఏపీ, తెలంగాణలో పలు ఇండ్లను ఊడ్చేసిన దొంగలు!