BigTV English

Anchor Suma: అమ్మ బాబోయ్.. కేరళలో రూ.278 కోట్లతో ఇల్లు కట్టిన సుమ.. ?

Anchor Suma: అమ్మ బాబోయ్.. కేరళలో రూ.278 కోట్లతో ఇల్లు కట్టిన సుమ.. ?

Anchor Suma: యాంకర్ సుమ కనకాల.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు  యాంకర్స్ అంటే ఉదయభాను, ఝాన్సీ అనే పేర్కులు వినిపించాయి. కానీ, సుమ వచ్చాకా.. యాంకరింగ్ కు గాడ్ ఫాదర్ గా మారింది. ఒక మలయాళీ  అయ్యి ఉండి కూడా తెలుగువారు కన్నా ఎక్కువ తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో ఇంటర్వ్యూ ఏదైనా.. ఈవెంట్ ఎవరిదైనా యాంకరింగ్ మాత్రం సుమదే ఉంటుంది.


ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా వచ్చింది అంటే కచ్చితంగా సుమ ఇంటర్వ్యూ ఉండాల్సిందే. ఒకపక్క షోస్, ఇంకోపక్క ఈవెంట్స్, మరోపక్క ఇంటర్వూస్.. ఇలా చేతినిండా పనితో సుమ అస్సలు ఖాళీ లేకుండా కష్టపడుతుంది. అంటే ఆమెకు ఎంత డబ్బు ఉందో అని అందరూ చర్చించుకోవడం కామనే. ఇక ఈ సోషల్ మీడియా వచ్చాకా ఏ వార్తను నమ్మాలో.. ఏ వార్తను నమ్మకూడదో అనేది కూడా ప్రేక్షకులు నమ్మలేకపొతున్నారు.

స్టార్ హీరో ఆస్తులు ఇన్ని కోట్లు..  ఆ హీరోయిన్ కు  ఎన్ని లగ్జరీ ఇళ్లు ఉన్నాయో తెలుసా.. ?  ఈ హాట్ బ్యూటీ సంపాదించింది ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఇలాంటి థంబ్ నెయిల్స్ తో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లైక్స్ కోసం, షేర్స్ కోసం ఇలాంటి వీడియోలను  రిలీజ్ చేసి.. డబ్బులు సంపాదిస్తున్నాయి.


Shankar: రూ. 450 కోట్లు ఖర్చు పెట్టించి.. సినిమాను డిజాస్టర్ చేసి.. ఇప్పుడు కవరింగా శంకర్ మావా

ఇక తాజాగా సుమ.. కేరళలో రూ.278 కోట్లతో ఇల్లు కట్టినట్లు ఒక వీడియో వైరల్ గా మారింది. అందులో ఒక పెద్ద లగ్జరీ హౌస్ ను చూపిస్తూ.. వెనుక ఒక అమ్మాయి వాయిస్ సుమ గురించి చెప్పుకుంటూ వస్తుంది. సుమ ఇల్లు కేరళలో ఎలా ఉందో చూద్దాం అంటూ మొదలుపెట్టిన ఆమె.. ఆ ఇల్లు విలువ రూ.278 కోట్లని, ఈ ఇంట్లో 500 సీసీ కెమెరాలు ఉన్నాయని, పదిమంది పనివారు ఉన్నారని చెప్పుకొచ్చింది.

ఇక ఈ వీడియోపై  సుమ స్పందించింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమె మాట్లాడుతూ ఆ ఇల్లును చూపిస్తూ.. అది ఫేక్ నా.. ? రియల్ నా.. ? అనే విషయాన్నీ క్లారిటీ ఇచ్చింది. అసలు తనకు కేరళలో ఇలాంటి ఇల్లు లేదని స్పష్టం చేసింది. “ఎవర్రా మీరంతా .. నేనెప్పుడు కట్టానురా ఇంత ఇల్లు. నేను కేరళలో ఏ ఇల్లు కట్టించలేదు. అంతా ఫేక్. 2018 లో రూ.278 కోట్లతో కట్టానని  ఈ వీడియోలో  ఉంది. అసలు రూ.278 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయమ్మా.. ఏమనుకుంటున్నావమ్మా నువ్వు. నేనేమైనా అంబానీ ఫ్యామిలీ అనుకుంటున్నావా.. ? 500 సీసీ టీవీ కెమెరాలు.

ఒక హౌస్ లో 5 రూమ్ లు ఉంటే.. ఒక్కో రూమ్ లో 5 కెమెరాలు పెట్టినా  25 మాత్రమే వస్తాయి.. 500 కెమెరాలు ఎక్కడ పెడతారండి.. అదేమైనా బిగ్ బాస్ హౌస్ నా. మీరు గమనించాల్సింది ఏంటి అంటే.. ఇలాంటి ఫేక్ వీడియోస్ లో ముఖ్యంగా నేను కనిపించకుండా.. నా ఫొటోస్ ను కోలాడ్ చేసి.. ఎక్కడో థాయ్ ల్యాండ్ లోనో, గోవాలోనో ఉన్న హౌసెస్ ను పెట్టి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ తో వచ్చే వీడియోలు అన్ని ఫేక్. మేము సెలబ్రిటీస్ .. మా అంతట మేమే  వచ్చి మాట్లాడితే తప్ప నమ్మకండి. ఇక ఇప్పుడు AI కూడా వచ్చింది.  ఇప్పుడు మా పెదాలు చూసి  నిజంగా మేమే మాట్లాడుతున్నామా అని నిర్దారించుకోండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×