E-Paper
Advertisement

Skydiver Viral Video: 15 వేల అడుగుల ఎత్తులో.. విమానం తోకకు చిక్కుకున్న స్కైడైవర్.. వీడియో వైరల్

Skydiver Viral Video:  15 వేల అడుగుల ఎత్తులో.. విమానం తోకకు చిక్కుకున్న స్కైడైవర్.. వీడియో వైరల్
Advertisement

Skydiver Viral Video: ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్‌లో ఓ స్కైడైవ‌ర్‌ విన్యాసం వికటించింది. విమానం నుంచి స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పారాచూట్ ఓపెన్ అయింది. పారాచూట్ విమానం తోక భాగంలో చిక్కుకొని స్కైడైవర్ గాలిలో వేలాడాడు. కెయిన్స్ ప్రాంతంలో స్కైడైవింగ్ స్టంట్ కోసం చేసిన విన్యాసం విఫ‌ల‌మైంది. విమానం నుంచి డైవింగ్ కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో.. స్కైడైవ‌ర్ పారాచూట్ విమానం తోకకు చిక్కుకుంది. దీంతో అతడు గాలిలో వేలాడాడు. సుమారు 15 వేల అడుగుల ఎత్తులో విమానానికి వేలాడుతున్న స్కైడైవర్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పారాచూట్ కెమెరా ఆప‌రేట‌ర్ ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీశాడు. సెప్టెంబ‌ర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ఆస్ట్రేలియా అధికారులు తాజాగా విడుదల చేశారు.

ప్రాణం కాపాడిన రిజర్వ్ పారాచూట్

క్వీన్స్ ల్యాండ్ లో 15 వేల అడుగుల ఎత్తులో 16 మంది స్కైడైవ‌ర్స్ పారాచూట్‌తో స్టంట్ చేయాలని నిర్ణయించారు. విన్యాసానికి విమానం నుంచి దూకుతున్న సమయంలో వారి ప్లాన్ విక‌టించింది. ఓ స్కైడైవ‌ర్ పారాచూట్‌ విమానం వింగ్‌కు చిక్కుకుంది. దీంతో అత‌డు చిక్కుకున్న పారాచూట్ ను కత్తిరించాడు. రిజ‌ర్వ్ పారాచూట్‌తో క్షేమంగా ల్యాండ్ అయ్యాడు. ఆరెంజ్ రంగు పారాచూట్ విమానం తోక భాగాన్ని అల్లుకుపోయింది. పారాచూట్‌కు చెందిన స్ట్రింగ్స్‌ను హుక్ నైఫ్‌తో క‌ట్ చేశాడు. మరో పారాచూట్‌ను ఓపెన్ చేసి సురక్షితంగా నేలపై ల్యాండ్ అయ్యాడు.

Advertisement

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిజర్వ్ పారాచూట్ ఉండడంతో అతడు సురక్షితంగా బయటపడగలిగాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గాలిలో విన్యాసాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Thailand Trip: భార్యకు బిజినెస్ ట్రిప్ అని చెప్పి థాయ్‌లాండ్ చెక్కేసిన భర్త.. పాపం, వరదల్లో అల్లాడిపోతూ.. లవర్‌తో దొరికిపోయాడు

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×