BigTV English

Baby Girl Adoption: తాము ఉద్యోగం చేసుకోవాలి.. మా కుమార్తెను దత్తత తీసుకుంటారా!

Baby Girl Adoption: తాము ఉద్యోగం చేసుకోవాలి.. మా కుమార్తెను దత్తత తీసుకుంటారా!


Baby Girl Adoption-Viral Post: పిల్లలు లేరని చాలా మంది తల్లి దండ్రులు తీవ్ర మనోవేదన చెందుతూ ఉంటారు. పిల్లల కోసం గుళ్లు, గోపురాలు తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆస్పత్రులు, IVF లు అంటూ కనిపించిన చోటల్లా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి తల్లి దండ్రులను పిల్లల కోసం ఆరాటపడుతుంటే.. కొందరు తల్లి దండ్రులు మాత్రం పుట్టిన పిల్లలను దత్తత ఇవ్వడం, అమ్ము కోవడం చేస్తున్నారు. ఇటీవల కాలంలో అనేక మంది యువత వారి కెరియర్ కోసం, ఉద్యోగ పనిలో పడి వివాహ జీవితాన్ని, పిల్లలను తమ ఎదుగుదలకు అడ్డంకిగా భావిస్తున్నారు. ఇక తాజాగా ఓ జంట సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

తమకు మూడు నెలల కుమార్తె ఎలిజిబెత్ ఉందని .. ఆ చిన్నారిని దత్తత ఇద్దామనుకుంటున్నట్లు వారు ప్రకటించారు. దానికి ఆ జంట చెప్పిన కారణం.. వారు తమ ఉద్యోగాల్లో జిజీగా ఉండటం వల్ల పాపను చూసుకోవడానికి సమయం సరిపోవట్లేదని.. ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. తామిద్దరం ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల తమ కుమార్తెకు కావాల్సిన అవసరాన్ని, సమకూర్చడానికి పనిని వదులుకోవాల్సి వస్తుందని తాము వర్క్ హాలిక్ లైనా మేము అలా చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చాడు.


Also Read: ఐస్‌క్రీం కావాలని మీ పిల్లలు మారాం చేస్తున్నారా.. ఈ వీడియో చూపించండి.. ఐస్‌క్రీం మాటే ఎత్తరు

తన భార్య నిత్యం ఆఫీస్ కు వెళ్లడంతో పాపకు పాలు పట్టించడం, బట్టలు మార్చడం, స్నానం చేయించడం తప్ప మరేమి చేయదన్నారు. ఇప్పటి వరకు తామిద్దరం కూతురితో సమయం గడపలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ చిన్నారిని వారి అమ్మమ్మ చూసుకుంటున్నట్లు తెలిపారు. బిడ్డకు జన్మనిచ్చిన రెండువారాలకే తన భార్య తిరిగి ఉద్యోగంలో చేరిందని చెబుతూ.. అది తనకున్న నిబద్ధత అలాంటిదని పొగడ్త గుప్పుమనిపించాడు. తమ చిన్నారిని ఆమె అమ్మమ్మ కాని, కుటుంబంలో ఎవరైన దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు.

వారు ముందుకు రాకపోతే ఇతరులు ఎవరికైన దత్తత ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన కొందరూ కామెంట్స్ చేస్తూ.. మీరు ఏమైనా రోబోలా లేదా మానవ జీవితాలతో ప్రయోగాలు చేస్తున్న గ్రహాంతర వాసులా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు ఆ మాత్రం దానికి పిల్లల్ని ఎందుకు కనడం అని విమర్శిస్తన్నారు.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×