E-Paper
Advertisement

Esther Anil: వెంకటేష్ రీల్ కూతురు హీరోయిన్ గా మరో సినిమా

Esther Anil: వెంకటేష్ రీల్ కూతురు హీరోయిన్ గా మరో సినిమా
Advertisement

Esther Anil: బాలనటులుగా ప్రేక్షకులను మెప్పించిన వారే ఇప్పుడు హీరో హీరోయిన్లుగా మారి కొత్త సినిమాలు తీస్తున్నారు. తాజాగా మలయాళ బాలనటి.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే బుట్టబొమ్మ సినిమాతో బాలనటి అయిన అనికా సురేంద్రన్ ను హీరోయిన్ గా చేశారు సితార ఎంటర్ టైన్మెంట్స్. ఇక ఇప్పుడు ఎస్తేర్ అనిల్ వంతు. ఎస్తేర్ మలయాళ బాలనటిగా ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం సినిమాలో చిన్న కూతురిగా నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత ఈ చిన్నది వెంకటేష్ రీల్ కూతురిగా మారిపోయింది.

Advertisement

ఇక ఈ చిన్నది ఇప్పటికే జోహార్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక తాజాగా మరో లక్కీ ఛాన్స్ ను అమ్మడు పట్టేసింది. ధమాకా సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ త్రినాధరావు నక్కిన నిర్మాతగా మారిన విషయం తెల్సిందే. ప్రస్తుతం నిర్మాతగా ఆయన తన తదుపరి సినిమాను యంగ్ నటీనటులతో తెరకెక్కిస్తున్నాడు.

నిర్మాత లగడపాటి శ్రీధర్ కుమారుడు సహిదేవ్ విక్రమ్ హీరోగా, ఎస్తేర్ అనిల్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. వెంకట్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సందీప్ కిషన్ క్లాప్ కొట్టగా హీరో సుమంత్ కెమెరా స్విచ్ ను ఆన్ చేశాడు. యూత్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఎస్తేర్ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×