BigTV English

Ice Cream: ఐస్‌క్రీం కావాలని మీ పిల్లలు మారాం చేస్తున్నారా.. ఈ వీడియో చూపించండి.. ఐస్‌క్రీం మాటే ఎత్తరు

Ice Cream: ఐస్‌క్రీం కావాలని మీ పిల్లలు మారాం చేస్తున్నారా.. ఈ వీడియో చూపించండి.. ఐస్‌క్రీం మాటే ఎత్తరు


Ice Cream: ప్రపంచంలో నీకు ఏది ఎక్కువ ఇష్టం అంటే ఐస్ క్రీం అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీంలు లాగించేస్తుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, అమ్మాయిలు అయితే ఐస్‌క్రీం అంటే పడి చచ్చిపోతారంతే. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు ఐస్ క్రీం ఫ్యాక్టరీలకు లాభాలే లాభాలే మరి. అంతలా సేల్ అవుతుంటాయి. తరచూ తినడానికి ఇష్టపడని వారు కూడా ఎండాకాలంలో చల్లదనం కోసం ముసలి వారి నుంచి చిన్న పిల్లల వరకు ఐస్‌క్రీంలు తినేస్తుంటారు. అయితే ఐస్ క్రీంలు శరీరాన్ని చల్లబరిచి కాస్త ఉపశమనం కలిగిస్తాయి. చల్లచల్లని ఐస్ క్రీంలను తింటుంటే నిజంగా ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. మండుటెండలో తిరిగి వచ్చి చల్లటి గాలికి కూర్చుని చల్లచల్లని ఐస్ క్రీంను తింటుంటే కడుపులో చల్లగా ఉంటుంది. అయితే ఈ ఐస్ క్రీంలలో చాలా రకాలు ఉంటాయి. రకరకాల పండ్ల ఫ్లేవర్లను తయారుచేస్తుంటారు.

ముఖ్యంగా బయట స్వీట్లు, డెజర్ట్‌లు ఎన్ని ఉన్నా కూడా ఐస్ క్రీంలను తినడానికే ఇష్టపడుతుంటాం. అయితే తాజాగా ఐస్ క్రీంలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కసారి పిల్లలకు ఐస్ క్రీంలను అలవాటు చేస్తే ఇక అస్సలు వదలరు అంతే. పిల్లలను తీసుకుని బయటకు వెళితే చాలు.. అక్కడ ఐస్ క్రీం కనిపిస్తే కొనివ్వాలని మారాం చేస్తుంటారు. కొనివ్వకపోతే గుక్కపట్టి ఏడుస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే పిల్లలు ఐస్ క్రీం అస్సలు కొనివ్వమని అడగరు. మరి ఈ వీడియో ఏంటో చూద్దాం.


Also Read: మహిళ కారును వెంబడించిన రౌడీలు.. ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే

ఓ భయంకరమైన ఐస్ క్రీం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హాలీవుడ్ లోని హారర్ సినిమాల్లో చూపించే బొమ్మలతో ఐస్ క్రీంను తయారు చేశారు. ఓ బొమ్మ తలను పెట్టి దానిపై రక్తం(రెడ్) కలర్ తో ఉండే ఐస్ క్రీం ప్లేవర్ వేసి పెట్టారు. ఆ బొమ్మ కళ్లు పైకిచూస్తూ భయంకరంగా కనిపిస్తుంది. ఇలా అన్ని బొమ్మలు వరుసగా అమర్చి పెట్టారు. దీనిని చూసి చాలా మంది భయపడిపోతున్నారు.

?utm_source=ig_web_copy_link">

(వీడియో కోసం పైన ఉన్న ఫోటోను క్లిక్ చేయండి)

ఈ వింత ఐస్ క్రీంకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్ స్టాగ్రాంలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందిస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘వామ్మో ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాయి. అసలు వీటిని ఎవరైనా తింటారా’ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘ఈ వీడియోను ఐస్ క్రీం కావాలంటూ ఏడ్చే పిల్లలకు చూపిస్తే.. ఇక ఐస్ క్రీం అస్సలు అడగరు’ అని ఫన్నీ కామెంట్ చేశారు. ఇక మరొకరు.. ‘పిల్లలు ఆ వీడియో చూస్తే అదే బొమ్మ ఐస్ క్రీం కావాలని మారాం చేస్తారు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Related News

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Big Stories

×