E-Paper
Advertisement

Street Dog: ఫేమస్ స్ట్రీట్ డాగ్‌ను.. కారుతో తొక్కించిన డ్రైవర్.. పోలీసులు ఏం చేశారంటే?

Street Dog: ఫేమస్ స్ట్రీట్ డాగ్‌ను.. కారుతో తొక్కించిన డ్రైవర్.. పోలీసులు ఏం చేశారంటే?
Advertisement

Street Dog: బెంగళూరులోని సంజయ్ నగర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 11న రాకీ అనే పేరుతో లోకల్ గా పాపులర్ అయిన వీధి కుక్కను.. ఓ కారు ఢీకొట్టింది. దీంతో స్థానికులు, జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. శునకాన్ని ఢీకొట్టడమే కాకుండా కనీసం కారు కూడా ఆపకుండా వెళ్లిపోవడంపై లోకల్స్ మండిపడుతున్నారు. స్థానిక మహిళ జీవిక గౌడ ఫిర్యాదుతో ట్రాఫిక్ పోలీసులు సదరు కారు డ్రైవర్ పై కేసు కూడా నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇన్నోవా కారు డ్రైవర్ నిర్లక్షంగా వచ్చి రాకీ అనే వీధి కుక్కను ఢీకొట్టాడు. రాకీని కాపాడటానికి డ్రైవర్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయినట్లు జీవికా గౌడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యం, అమానవీయ ప్రవర్తన కారణంగా డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసారు.

Advertisement

Also Read: Washing Machines Under 15,000: తక్కువ ధరలో బెస్ట్ వాషింగ్ మిషన్లు.. ఏమున్నాయ్ భయ్యా.. ఓ లుక్కేయండి!

స్థానిక మహిళ ఫిర్యాదు ఆధారంగా డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. ప్రమాదం జరిగిన ఏరియాలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ ను త్వరలోనే గుర్తించి అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు మూగజీవాల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారిని.. జంతు సంరక్షణ చట్టాల ప్రకారం కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: Maha Shivaratri 2026: గ్రహ దోషాలు తొలగి రాజయోగం పట్టాలంటే.. శివరాత్రి రోజు ఇలా చేయండి

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×