E-Paper
Advertisement

ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే.. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న సమస్తిపూర్ వీడియో!

ఈ తల్లి ధైర్యానికి చేతులెత్తి మొక్కాల్సిందే.. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న సమస్తిపూర్ వీడియో!
Advertisement

Mother bravery: కన్నబిడ్డల కోసం ఓ తల్లి చేసిన ప్రాణసంకట పోరాటం చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన మాతృత్వానికి నిలువెత్తు రూపంలా నిలిచింది. ఓ మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలను తీసుకుని రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో, ఊహించని విధంగా ఓ రైలు అత్యంత వేగంతో దూసుకొచ్చింది. పక్కకు తప్పుకునే లోపే రైలు దగ్గరకు వచ్చేయడంతో ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. కానీ, బిడ్డలను ఎలాగైనా కాపాడుకోవాలన్న తపన ఆమెలో ధైర్యాన్ని నింపింది.

క్షణాల్లోనే ఆలోచించి, ఆ తల్లి తన ఇద్దరు పిల్లలను గుండెలకు హత్తుకుని ప్లాట్‌ఫామ్‌కు, పట్టాలకు మధ్య ఉన్న అత్యంత ఇరుకైన సందులో పడుకుంది. రైలు పెట్టెలు తనపై నుంచి వేగంగా వెళ్తున్నా, గుండె నిబ్బరంతో పిల్లలను కదలకుండా పట్టుకుంది. రైలు వెళ్లే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శ్వాస బిగబట్టింది. చివరకు రైలు వెళ్లిన తర్వాత ముగ్గురూ క్షేమంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన చూసిన ప్రయాణికులు ఆ తల్లి సాహసానికి కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో, స్టేషన్‌లో కనీసం వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జ్) లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటూ రైల్వే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవ్వరు- మాజీ మంత్రి అమరనాథ్

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×