Viral News: ఇటీవల కాలంలో పెళ్లిళ్ల ట్రెండ్ క్రమంగా మారుతోంది. పెళ్లైన వారు మళ్లీ పెళ్లి చేసుకోవడం, వయస్సు బేధం లేని వివాహాలు కూడా అనేకం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కొత్తగా పెళ్లైన జంట విషయంలో క్రేజీ విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే పెళ్లైన రెండు రోజులకే, కొత్తగా పెళ్లైన వధువు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో షాకైన వరుడు ఆ బిడ్డ తనది కాదని పేర్కొన్నాడు. కానీ వధువు ఫ్యామిలీ మాత్రం మరోలా చెబుతుంది. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ సంఘటన ప్రయాగ్‌రాజ్‌లోని కర్చన తహసీల్ ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగింది. ఫిబ్రవరి 24న ఈ జంటకు పెళ్లైంది. ఆ తర్వాత యువకుడి వివాహ ఊరేగింపు జస్రా గ్రామానికి వెళ్ళింది. పెళ్లి తర్వాత రోజు ఫిబ్రవరి 25న వధువు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. వీడ్కోలు తర్వాత వధువు ఇంటికి చేరుకున్నప్పుడు, చుట్టుపక్కల నుంచి వచ్చిన బంధువులు, ప్రజలు ఆమెను చూసేందుకు వచ్చారు. ఆ క్రమంలో ‘ముహాన్ దిఖాయ్’ కార్యక్రమం రోజంతా కొనసాగింది. ఈ కార్యక్రమం తర్వాత అందరూ నిద్రపోయారు. మరుసటి రోజు ఫిబ్రవరి 26న ఉదయం కోడలు నిద్ర లేవగానే, ఆమె టీ తయారు చేసి అందరికీ అందించింది.
కానీ అదే రోజు ఫిబ్రవరి 26న వధువుకు అకస్మాత్తుగా కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. మొదట దానిని పట్టించుకోలేదు. కానీ తరువాత నొప్పి భరించలేనప్పుడు, ఆమె తన అత్తమామలకు చెప్పింది. ఆ తర్వాత కుటుంబం ఆమెను CHC కార్చనకు తీసుకెళ్లింది. పరీక్ష చేసిన తర్వాత, ఆమె కడుపులో తొమ్మిది నెలల పిండం ఉందని, బిడ్డ ఎప్పుడైనా పుట్టవచ్చని వైద్యులు చెప్పారు. ఇది విన్న వరుడు, అతని కుటుంబం షాక్ అయ్యారు. కొంత సమయం తరువాత వధువు ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
వివాహం తర్వాత ఆనంద సమయం కాస్తా దుఃఖంగా మారిపోయింది. ఆసుపత్రిలో ప్రసవం తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. అదే సమయంలో బిడ్డ పుట్టిన తరువాత, వరుడు ఈ బిడ్డ తనది కాదని పేర్కొన్నాడు. అసలు ఈ వధువు తనకు వద్దని నిరాకరించాడు. ఆ క్రమంలోనే వధువు తల్లిదండ్రులను కూడా పిలిపించారు. ఈ జంటకు 4 నెలల క్రితమే పెళ్లి నిశ్చయమైందని, పెళ్లికి ముందు వీరిద్దరూ కలిసేవారని అమ్మాయి తండ్రి అన్నాడు.
కానీ వరుడు ఆ ఆరోపణలను నిరాధారమైనవని పేర్కొన్నాడు. దర్యాప్తు చేయాలని సవాల్ చేశాడు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం పెరగడంతో గ్రామంలో పంచాయితీ జరిగింది. చివరకు వధువు బిడ్డతోపాటు ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఈ విషయంలో ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది తెలిసిన పలువురు యువతికి పెళ్లైన సమయంలో ఆమె గర్భవతి అని వరుడికి తెలియదా, గమనించలేదా అని ప్రశ్నిస్తున్నారు.