BigTV English
Advertisement

Nani : ఆ సెంటిమెంట్ ను వదలని నాని.. ఈసారి పక్కా బ్లాక్ బాస్టరే..?

Nani : ఆ సెంటిమెంట్ ను వదలని నాని.. ఈసారి పక్కా బ్లాక్ బాస్టరే..?

Nani : టాలీవుడ్ స్టార్ హీరో నాచురల్ స్టార్ నాని ( Nani ) హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ ఏడాది హిట్ 3( Hit 3) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత మరో సినిమాలో నటిస్తున్నాడు. గతంలో నాని నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ దసరాకు సీక్వెల్ గా ది ఫ్యారడైజ్ ( The Paradise) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. స్టోరీ కొత్తగా ఉండటంతో మూవీ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ మూవీ విషయంలో నాని సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది.. ఆ రోజే మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఆ రోజేంటో ఒకసారి తెలుసుకుందాం..


Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ‘డ్రాగన్ ‘ రిలీజ్ అయ్యేది అప్పుడే..?

నాని నటిస్తున్న సినిమాలు.. 


హీరో నాని ఈమధ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. సినిమాల్లో నటిస్తూ ఒక్కో సినిమాకి ఒక్క వేరియేషన్ ను చూపిస్తూ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. నాని సినిమా వస్తుందంటే కచ్చితంగా హిట్ అవుతుందని ఫాన్స్ ఒక అభిప్రాయానికి వచ్చేసారు.. 2024లో హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నానికి ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించాయి. ప్రస్తుతం హిట్ 3 సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఆ తర్వాత దసరా మూవీకి సీక్వెల్ గా రాబోతున్న ది పారడైజ్ మూవీ లో కూడా నాని నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని సెంటిమెంట్ నీ ఫాలో అవుతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. నాని ఫాలో అవుతున్న ఆ సెంటిమెంట్ ఏంటో ఒకసారి చూసేద్దాం..

సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న నాని.. 

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందిస్తున్నాడు. అయితే, నాని తన గతకొన్ని చిత్రాలలో ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. తన నెక్స్ట్ చిత్రాల విషయంలోనూ ఈ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘దసరా’ మూవీ 2023 మార్చి 30న గురువారం రోజు రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే విధంగా.. హాయ్ నాన్న మూవీ 2023 డిసెంబర్ 7న గురువారం రోజున.. సరిపోదా శనివారం  2024 ఆగస్టు 29న గురువారం రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు హిట్-3 మూవీని 2025 మే 1న గురువారం రోజున రిలీజ్ అవ్వబోతుంది. ఇక ది ప్యారడైజ్ మూవీకి కూడా అదే ఫాలో అవుతున్నాడు. వచ్చే ఏడాది మార్చి 26 న గురువారం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. గురువారం రోజున రిలీజ్ చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు నాని. ఇప్పుడు తన రాబోయే సినిమాలను కూడా అదే సెంటిమెంట్‌తో రిలీజ్ చేస్తూ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు.. మొత్తానికి నాని సెంటిమెంట్ కాస్త బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేలా చేస్తుంది. ది ప్యారడైజ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×