Today Gold Rate: గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. మళ్లీ పెరిగి సడెన్ షాకిచ్చాయి.. ఒక్కసారిగా రూ.700 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,100 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.760 పెరిగి, రూ.87,380 కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా నడుస్తున్న వాణిజ్య యుద్ధ భయం.. బంగారాన్ని రికార్డు స్థాయికి తీసుకెళుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్దిక, భౌగోళిక రాజకీయాలు అత్యంత అస్థిరంగా ఉన్న సమయంలో.. బంగారాన్ని సాంప్రదాయకంగా సురక్షితమైన ఆస్తిగా చూస్తున్నారు. దీంతో దేశంగా పలు సంస్థలు, ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది పసిడి ధరల మరింత ఊపును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇక బలహీనమైన త్రైమార్షిక ఆదాయాలు, విదేశీ పెట్టుబడుదారుల నిరంతర అమ్మకాల మధ్య ఇటీవల నెలల్లో దేశీయ మార్కెట్ షార్ప్ అమ్మకాలను చూశాయి.
ఇలా నిదానంగా నడుస్తున్న ఈక్విటీ మార్కెట్ పోకడలు కొంత మంది పెట్టుబడుదారుల డబ్బును బంగారం, వెండి లాంటి విలువైన లోహాలవైపు తిప్పుతోంది. ఇలాంటి తక్కువ రిస్క్ ఆస్తులకు ఇన్వెస్టర్లు వారి డబ్బంతా మళ్లిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక దేశీయ మార్కెట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 2, 2025 నుండి అమల్లోకి వచ్చేలా ఆభరణాలు, విడిభాగాలపై కస్టమ్స్ సుంకం తగ్గింపును 25 శాతం నుండి 20 శాతంకి ప్రకటించారు. ఆభరణాల సుంకాలను తగ్గించడం వల్ల దేశీయ డిమాండ్ పెరుగుతుందని, ముఖ్యంగా లగ్జరీ విభాగంలో ఇది పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి బంగారం ధరలను పెంచవచ్చని తెలుస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి మొదట్లోనే ప్రధాన భారతీయ ఆభరణాల వ్యాపారుల షేర్లు తొమ్మిది శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
గోల్డ్ రేట్స్ ఇలా..
రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,530కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,250 ఉంది.
చెన్నైలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,100కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,380 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,100 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.87,380కి చేరుకుంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,100 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,380 పలుకుతోంది.
కేరళ, కోల్‌కత్తాలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,100 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,380 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,380 పలుకుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,100 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,380 వద్ద ట్రేడ్ అవుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.80,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,380 ఉంది.
Also Read: ఏది బెస్ట్.. దేనిలో ఎక్కువ మొత్తం లభిస్తుంది..
వెండి ధరలు పరిశీలిస్తే..
వెండి ధరలు కూడా ఉన్నట్టుండి భారీగా పెరిగాయి. నేడు హైదరబాద్, వైజాగ్, చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ.1,07,000 కి చేరుకుంది.
బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.96,900 వద్ద కొనసాగుతోంది.