E-Paper
Advertisement

Viral Video: బైకర్ అసభ్య ప్రవర్తన.. జిప్ ఓపెన్ చేసిన తర్వాత, చీపురితో ఒక్కటేసిన మహిళ, వీడియో వైరల్

Viral Video: బైకర్ అసభ్య  ప్రవర్తన.. జిప్ ఓపెన్ చేసిన తర్వాత, చీపురితో ఒక్కటేసిన మహిళ, వీడియో వైరల్
Advertisement

Viral Video: సమయం.. సందర్భం.. ఏంటో తెలీదుగానీ, అనుకోని ఘటనలు కొన్ని జరుగుతుంటాయి. ఆ సమయంలో కెమెరాకు చిక్కితే.. ఇక కొంప కొల్లేరు. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ డ్యామేజ్. ఇక సోషల్‌మీడియాలో ఉతికి ఆరేస్తారు. సరిగ్గా ఆ యువకుడి విషయంలో అదే జరిగింది. సరిగ్గా చెన్నైలో అలాంటి ఘటన జరిగింది.

మహిళ పట్ల బైకర్ అసభ్య ప్రవర్తన

Advertisement

సోమవారం వేకువజామున చెన్నైలోని అడయార్ వంతెన సమీపంలో రోడ్లను క్లీన్ చేస్తున్నారు శానిటరీ వర్కర్లు. 50 ఏళ్ల మహిళ డ్యూటీలో ఉండగా టూ వీలర్‌పై ఓ యువకుడు వేగంగా వచ్చాడు. శానిటరీ వర్కర్‌కు దగ్గరలో వాహనాన్ని ఆపాడు. తన ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి ప్రైవేటు పార్టుని చూపించే ప్రయత్నం చేశాడు. ఈలోగా తేరుకున్న ఆ వర్కర్, తన చేతిలో ఉన్న చీపురితో అతడ్ని చితకబాదింది.

దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సన్నివేశానికి కూతవేటు దూరంగా ఓ యువకుడు తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. ఆ తర్వాత వైరల్ అయ్యింది. చివరకు ఈ వ్యవహారం పోలీసుల దృష్టిలో పడింది.

Advertisement

చీపురితో యువకుడ్ని బాదిన మహిళ

దీనిపై విచారణ మొదలుపెట్టారు. బైక్ పై వచ్చిన వ్యక్తి బహుశా కాలేజీ విద్యార్థి కావచ్చని తాను భావించానని శానిటరీ వర్కర్ తెలిపింది. దగ్గరికి వెళ్ళినప్పుడు జిప్ ఓపెన్ చేసేసరిని తాను షాక్ అయ్యానని, ఆ తర్వాత కొట్టినట్టు తెలిపింది. ఇలాంటి సంఘటనలు గతంలో జరిగాయని అంటోంది. తెల్లవారుజామున పనిచేసే పారిశుధ్య సిబ్బందికి మెరుగైన భద్రత కల్పించాలని అధికారులను కోరింది ఆమె.

దీనిపై సోషల్ మీడియాలో ఎవరికివారు రకరకాలుగా స్పందిస్తున్నారు. కావాలనే యువకుడు అలా చేశారని కొందరంటే, మరికొందరు మాత్రం ఆ బైకర్‌ని సపోర్టు చేస్తున్నారు. ఎందుకంటే అర్జెంటుగా యూరిన్ రావడం వల్ల జిప్ ఓపెన్ బరువు తీర్చుకోవాలని ప్రయత్నం చేశాడని అంటున్నారు.

ALSO READ: బర్రెల మీద పోలీసుల పెట్రోలింగ్..  ఆ బాధ తప్పాలంటే  ఇవే బెస్ట్

ఆ విషయాన్ని ఆ మహిళ అసభ్యకరంగా భావించిందని అంటున్నారు. ఏమైతేనేం.. ఈ వీడియోతో బైకర్ పరువు కాస్త బజారున పడింది. యువకులు తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే పబ్లిక్ ప్లేసులకు వెళ్లేటప్పుడు కెమెరాలు నిఘా ఉంటాయని, అలాగే మరికొందరు మొబైల్‌తో రెడీ ఉంటారని అంటున్నారు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×