E-Paper
Advertisement

Cops Ride Buffaloes: బర్రెల మీద పోలీసుల పెట్రోలింగ్, ఆ బాధ తప్పాలంటే ఇవే బెస్ట్!

Cops Ride Buffaloes: బర్రెల మీద పోలీసుల పెట్రోలింగ్, ఆ బాధ తప్పాలంటే ఇవే బెస్ట్!
Advertisement

Cops Ride Buffaloes:

నేరస్తులను పట్టుకోవాలంటే పోలీసుల దగ్గర అత్యాధునిక ఆయుధాలు, అంతకు మించి వాహనాలు ఉండాలి. ఇండియా లాంటి దేశాల్లో ఇన్నోవా కార్లు, జీపుల్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారు. దుబాయ్, కువైట్ లాంటి దేశాల్లో BMW లాంటి లగ్జరీ కార్లను పెట్రోలింగ్ కోసం వాడతారు. కానీ, కొన్ని దేశాల్లో విచిత్రంగా పోలీసులు బర్రెలను పెట్రోలింగ్ కోసం వాడుతున్నారు. ఇంతకీ బర్రెలను పెట్రోలింగ్ కోసం వాడే పోలీసులు ఎవరో తెలుసా?

మారజో ద్వీపంలోని బర్రెలే పెట్రోలింగ్ వాహనాలు

బ్రెజిల్‌ అమెజాన్ డెల్టాలోని మారజో ద్వీపంలోని సౌర్ అనే చిన్న పట్టణం ఉంది. ఈ ప్రదేశం ఎక్కువగా అడవితో నిండి ఉంటుంది. అక్కడి భూమి ఎక్కువగా చిత్తడి నేలలు, నదులు, బురదతో నిండి ఉంది. అక్కడ కార్లు నడవాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. బాగా నడవవు. అందుకే, వాహనాలకు బదులుగా బర్రెల మీద కూర్చొని అక్కడి పోలీసులు పెట్రోలింగ్ చేస్తారు. పట్టణంలో ఎలాంటి నేరాలు జరగకుండా కాపాడుతారు.

బర్రెలనే ఎందుకు వాహనాలుగా వాడుతారు?

Advertisement

మారజో ద్వీపం చాలా పెద్దది. స్విట్జర్లాండ్ పరిమాణంలో ఉంటుంది. కానీ, అక్కడి నేలలు తడిగా ఉంటాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత బురదమయంగా మారిపోతుంది. రోడ్లు కూడా దారుణంగా తయారవుతాయి. కార్లు, గుర్రాలు కూడా ఆ రోడ్ల మీద నడవాలంటే ఇబ్బంది పడుతాయి. ఇక్కడ పరిస్థితులను తట్టుకుని నడిచేందుకు నీటి బర్రెలు సరిపోతాయి. బలంగా ఉండే ఈ బర్రెలు, నీళ్లు, బురద, గుంటలు అని తేడా లేకుండా నడుచుకుంటూ ముందుకుసాగుతాయి.

1990 నుంచి బర్రెలపై పోలీస్ పెట్రోలింగ్

1990ల నుంచి సౌర్ పోలీసులు పట్టణంలో గస్తీ కాసేందుకు బర్రెలను ఉపయోగిస్తున్నారు. బర్రెల మీద ఉంటూ గస్తీ కాసే పోలీసులను ‘బఫెలో సోల్జర్స్’ గా పిలుస్తారు. అయితే, సాధారణ రైతులు వాడే బర్రెలతో పోల్చితే, పోలీసులు వాడే బర్రెలు మరింత బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఒక్కో బర్రె 2,000 పౌండ్ల వరకు బరువు ఉంటుంది. గస్తీ సమయంలో అవి బెదిరిపోకుండా ప్రత్యేకమైన శిక్షణ పొందుతాయి. పోలీస్ స్టేషన్లలో బర్రెలు ఉండేందుకు ప్రత్యేక స్థలం ఉంటుంది. అక్కడ వాటికి లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తారు.

Advertisement

Read Also: నానో బనానా 2 వస్తోంది.. ఇక రియల్, ఏఐ గుర్తించడం కష్టమేనట, ఎందుకంటే?

మనుషుల కంటే బర్రెలే ఎక్కువ

నిజానికి మరాజోలో ప్రజల కంటే బర్రెలు ఎక్కువగా ఉంటాయి. ఆ ద్వీపంలో సుమారు 500,000 బర్రెలు ఉన్నాయి. ఇవి రైతులకు వ్యవసాయం చేయడంలో ఉపయోగపడుతాయి. సరుకులను రవాణా చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. వీటిని స్థానిక పండుగలలో కూడా ప్రదర్శిస్తారు. మన దగ్గర సదర్ ఉత్సవం లాగా జరుపుతారు.

Read Also: ఇకపై అంతరిక్షంలో పురుగులు, మిడతలు తిననున్న వ్యోమగాములు.. ఎందుకంటే?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×