Lu Shandong: మాములుగా సూటు, బూటు వేసుకుంటే ఏమనుకుంటారు..ఏదైనా ఆఫీస్‌కో, బిజినెస్ మీటింగ్‌కో వెళ్తున్నాడని అనుకుంటారు. కాని ఇతన్ని చూసి కూడా మీరు అలాగే అనుకుంటే షూలో కాలేసినట్టే.ఎందుకంటారా.. అదే సూటు, బూటు వేసుకుని.. స్టైలిష్‌గా గాగుల్స్ పెట్టుకుని ఇతగాడు రోడ్డు పక్కన ఫ్రైడ్‌రైస్ వండడానికి వెళ్తాడు మరి. ఏంటి వినడానికే షాకింగ్ గా ఉందా ..
విషయంలోకి వెళ్తే …చైనాకు చెందిన 19 ఏళ్ల కుర్రాడు లూ షాన్‌డాంగ్ సరిగ్గా ఇదే ఐడియాతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. అందరిలా వండితే ఏముంది అనుకున్నాడో ఏమో.. వంటకు కాస్త ఫ్యాషన్‌ని, బోలెడంత క్రియేటివిటీని జోడించాడు. ఫలితం? అతడి ఫుడ్ స్టాల్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయల్లా వర్ధిల్లుతోంది. నెలకు ఏకంగా లక్షల రూపాయల లాభాలను వెనకేస్తూ హాట్ టాపిక్ అయిపోయాడు.
లూ షాన్‌డాంగ్ స్టైలే వేరు
మాములుగా ఏదైనా హోటల్‌కో, ఫుడ్ స్టాల్‌కో వెళ్తే అక్కడ వంట చేసే మాస్టర్లు లుంగీలతోనో లేదా సాధారణ దుస్తులతోనో, మహా అయితే కుక్ డ్రెస్‌లతోనో కనిపిస్తారు. కానీ, చైనాలోని జియాంగ్సు ప్రాంతానికి చెందిన లూ షాన్‌డాంగ్ స్టైలే వేరు. పక్కా కార్పొరేట్ లుక్‌లో.. ఇస్త్రీ నలగని బ్లేజర్, చేతికి వాచ్, కళ్లకు స్టైలిష్ గాగుల్స్ వేసుకుని పెనం ముందు నిలబడతాడు. భారీగా మంటలు ఎగసి పడుతుంటే పెద్ద కడాయిని పట్టుకుని, స్టైలిష్‌గా ఫ్రైడ్‌రైస్ చేస్తుంటాడు.ఇక ఇతగాడు ఆ ఫ్రైడ్‌రైస్ ని అలా టాస్ చేస్తుంటే కస్టమర్లు నోరెళ్లబెట్టాల్సిందే. నిజానికి అక్కడికి వచ్చే జనాలు ఫ్రైడ్‌రైస్ తినడం కంటే, లూ వంట చేసే ‘రాక్‌స్టార్’ స్టైల్‌ను చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారంటే నమ్మండి.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
also read :‘పెద్ది’ రిలీజ్ ముంగిట టాలీవుడ్‌లో హైడ్రామా.. ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం
మన కరెన్సీలో జస్ట్ రూ. 1,401 ధర
ఇక లూ షాన్‌డాంగ్ వంట చేస్తుండగా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఈ 19 ఏళ్ల యువకుడు రాత్రికి రాత్రే గ్లోబల్ వైరల్ సెలబ్రిటీ అయిపోయాడు.అయితే లూ కేవలం స్టైల్ లో మాత్రమే కాదండోయ్.వంటలోనూ మాస్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఎంతటి రద్దీ ఉన్నా సరే, ఆర్డర్ ఇచ్చిన కేవలం మూడు నిమిషాల్లోనే గుమగుమలాడే వేడివేడి ఫ్రైడ్‌రైస్‌ను కస్టమర్ల ముందుంచుతాడంటే నమ్మండి.అంతా బాగానే ఉంది ..ఇంతకీ ప్లేట్ ఎంతంటారా ..ఇక్కడ ఒక ప్లేట్ ఫ్రైడ్‌రైస్ ధర దాదాపు 120 చైనీస్ యువాన్లు అంటే మన కరెన్సీలో జస్ట్ రూ. 1,401ధరన్న మాట .రేట్ ఈ రేంజ్ లో ఉన్నా అతడి వంటలోని రుచికి, ఆ స్టైలిష్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఫిదా అయి జనాలు క్యూ కడుతున్నారంటే మనోడి స్టైల్ ఎలా మెస్మరైజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.ఇక
ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు నడిచే స్టాల్ నుండి మనోడు ఎంత వెనకేస్తాడో తెలుసా..
ఖర్చులన్నీ పోను లూ అక్షరాల నెలకు ఏకంగా 7 లక్షల రూపాయలకు పైనే నట.
మొదట్లో నవ్వులు పూయించడాకే
ఇక ఈ క్రేజ్ గురించి మనోడు మాట్లాడుతూ, మొదట్లో కస్టమర్ల ముఖాల్లో కాస్త నవ్వులు పూయించడానికి, సరదాగా ఈ సూటు వేసుకుని వండటం ప్రారంభించానని చెప్పాడు. కానీ, ఈ చిన్న ఐడియా తన జీవితాన్ని ఇంతలా మారుస్తుందని, ఇంతటి భారీ స్పందన వస్తుందని తాను అస్సలు ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశాడు. ఇకపోతే కస్టమర్లతో ఎప్పుడూ చిరునవ్వుతో మాట్లాడే లూ నవ్వుకు కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ కూడా ఉందండోయ్..
కేవలం కష్టపడి పనిచేస్తేనే సరిపోదు, దానికి కాస్త క్రియేటివిటీ, వినూత్న ఆలోచన తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని ఈ 19 ఏళ్ల చైనా యువకుడు ప్రూవ్ చేస్తున్నాడు.మరేంటి మీరు కూడా సూట్ బూటు తో రెడీ అయిపోతున్నారా …ఆల్ ది బెస్ట్ !
also read :పెళ్లయిన 5 నెలలకే నరకం .. టాలీవుడ్ నటి డెత్ మిస్టరీ..లవ్ మ్యారేజ్ చివరకు ఇలా ముగిసిందా?