E-Paper
Advertisement

పెళ్లయిన 5 నెలలకే నరకం .. టాలీవుడ్ నటి డెత్ మిస్టరీ..లవ్ మ్యారేజ్ చివరకు ఇలా ముగిసిందా?

పెళ్లయిన 5 నెలలకే నరకం .. టాలీవుడ్ నటి డెత్ మిస్టరీ..లవ్ మ్యారేజ్ చివరకు ఇలా ముగిసిందా?
Advertisement

Twisha Death : మాజీ మిస్‌ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్, టాలీవుడ్ నటి అయిన ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్‌లో ఉన్న అత్తవారింట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెల్సిందే. అందం, అమాయకత్వం, చదువు, సినిమా అవకాశాలు.. ఇలా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఒక యువతి పెళ్లయిన కేవలం ఐదు నెలలకే అనుమానాస్పద రీతిలో శవమై కనిపించడం అందరినీ పెద్ద షాక్ కి గురి చేసింది. అయితే తాజాగా ఈ మృతి వెనుకున్న అసలు నిజాలుఇపుడు బయటపడుతున్నాయి.ప్రేమించి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన ట్విషాకి ఆ ఇల్లే నరకంగా మారిందని, చనిపోవడానికి ముందు ఆమె పంపిన మెసేజ్ లతో క్లారిటీ వచ్చేస్తుంది.

ట్విషా శర్మ కెరీర్ మొదలెట్టినప్పటి నుండే

Advertisement

విషయంలోకి వెళ్తే ..ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ట్విషా శర్మ కెరీర్ మొదలెట్టినప్పటి నుండే తన ప్రతిభని చాటింది. 2012లో ప్రతిష్టాత్మక ‘మిస్‌ పుణె’ కిరీటాన్ని కైవసం చేసుకున్న ఆమె, ఆ తర్వాత మోడలింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకుంది.ఆ క్రమంలోనే పలు టాప్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసింది.ఇక చదువులోనూ ముందుండే ట్విషా, ఎంబీఏ పూర్తి చేసి ఒక ప్రముఖ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేసింది కూడా.ఇక గ్లామర్ ప్రపంచంపై ఉన్నఇష్టంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన ట్విషా తెలుగులో 2021 ఆగస్టు 27న విడుదలైన శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో కీలక పాత్ర పోషించి టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైంది.

డేటింగ్ యాప్ తో లాయర్ సమర్థ్‌ సింగ్‌తో పరిచయం

Advertisement

అయితే జీవితంలో ఎంతో ఎదగాల్సిన ట్విషా శర్మకు ఒక డేటింగ్ యాప్ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన లాయర్ సమర్థ్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో, ఇరు కుటుంబాలను ఒప్పించి గత ఏడాది 2025, డిసెంబర్‌లో వారు ఘనంగా వివాహం చేసుకున్నారు కూడా.అయితే, పెళ్లయిన కొన్ని రోజులకే ఆమె జీవితం నరకంగా మారిందని తెలుస్తుంది. భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్ (విశ్రాంత న్యాయమూర్తి)లు ఎక్కువ కట్నం తేవాలంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా టార్చర్ పెట్టారని సమాచారం.

also read :నాదగ్గర రూపాయి కూడా లేదు..రూ.100 కోట్ల ఆస్తి మొత్తం ఆమెకే రాసేశా.. పోసాని సంచలన వ్యాఖ్యలు

వైరల్ అవుతున్న మెసేజెస్ 

ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు తన తల్లికి, స్నేహితురాలికి పంపిన వాట్సాప్ మెసేజ్ లు ఇప్పుడు బయటపడి సెన్సేషన్ అవుతున్నాయి.ఏప్రిల్ 30న పంపిన మెసేజ్‌లో “అమ్మా.. నన్ను ఇక్కడ బతకనివ్వరు.. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి.. నా జీవితం నరకంలా మారింది” అంటూ మనసులోని బాధని మెసేజ్ లో వెళ్ళగక్కింది. ఆ తర్వాత మే 7న పంపిన మరో సందేశంలో “ఇక్కడ ఏదీ సరిగా లేదు, నేను ఈ బంధంలో ఇరుక్కుపోయాను” అని ట్విషా పేర్కొనడం చూస్తుంటే ఆమె ఎంతటి మానసిక క్షోభ అనుభవించిందో అర్థమవుతోంది.

సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్

ఇక తాజాగా ట్విషా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో భోపాల్‌లోని కటారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) రంగంలోకి దించారు. నిందితులు చట్టంలోని లొసుగులను వాడుకుంటూ ముందస్తు బెయిల్ పొందడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితుడైన భర్త సమర్థ్‌ సింగ్ పరారీలో ఉండగా, అతడి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.10 వేల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. ఒక సెలబ్రిటీ, విద్యావంతురాలైన మహిళకే అత్తవారింట్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ట్విషా శర్మ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి, ఆమెకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తోంది.చూడాలి మరి న్యాయం కాస్త లేటైనా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న సామెత నిజమవుతుందో లేదో !

also read :పెద్ది ట్రైలర్ రివ్యూ.. రామ్ చరణ్ ‘బీస్ట్ మోడ్’.. బుచ్చిబాబు ప్యూర్ మాస్ జాతర!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×