E-Paper
Advertisement

China Bridge: ప్రారంభించిన కొన్ని రోజులకే.. కుప్పకూలిన చైనా వంతెన, లక్ ఏమిటంటే

China Bridge: ప్రారంభించిన కొన్ని రోజులకే.. కుప్పకూలిన చైనా వంతెన, లక్ ఏమిటంటే
Advertisement

China Bridge: ఇండియా వస్తువుల అంటే వెంటనే మనకు టక్కున గుర్తుకు వచ్చేది ‘బ్రాండ్.. నాణ్యత గల వస్తువులు.. చాలా రోజుల వరకు క్వాలిటీగా పని చేస్తాయ్’ ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం.. అది మనం ఇండియన్ వస్తువులకు ఇచ్చే ప్రయారిటీ.. ఇక, అదే చైనా విషయానికి వస్తే.. మనకు వెంటనే గుర్తుకు వచ్చేది.. చైనా ప్రొడక్ట్ చాలా నాసిరకం.. చీప్ క్వాలిటీ అని మాట్లాడుకుంటాం.. ఆయితే ఆశ్చర్యం ఏంటంటే..? వాళ్లు నిర్మించిన 758 మీటర్ల పొడువైన వంతెన కూడా కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాలోని నైరుతి ప్రావిన్స్ అయిన సిచువాన్‌లో ఇటీవల ప్రారంభించిన నూతన హాంగ్కీ వంతెన కూలిపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచంలోనే అత్యుత్తమ నిర్మాణ ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన చైనాకు ఇది అప్రతిష్టగా మారింది. కేవలం కొద్ది నెలల క్రితమే ప్రారంభించిన ఈ వంతెన అకస్మాత్తుగా కూలిపోవడంతో. చైనీయ నిర్మాణ నాణ్యతపై స్థానికులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

758 మీటర్ల పొడవైన ఈ హాంగ్కీ వంతెన చైనా దేశ కేంద్ర భూభాగాన్ని టిబెట్‌తో అనుసంధానించే ముఖ్యమైన మార్గంలో ఉంది. వంతెన భాగాలు దిగువన ఉన్న నీటిలోకి పడిపోయినప్పటికీ, అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వంతెన కూలిపోవడానికి ప్రధాన కారణం భారీ కొండచరియలు విరిగిపడటమే అని స్థానిక అధికారులు స్పష్టం చేశారు. ఈ అనూహ్య ఘటనకు ఒక్కరోజు ముందే మేర్కాంగ్ నగర పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వంతెనపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. పోలీసులు సమీపంలోని గోడలు, రోడ్లపై పగుళ్లను గమనించారు. అంతేకాకుండా, స్థానిక పర్వత భూభాగంలో మార్పులు కనిపించడంతో వారు తక్షణమే అప్రమత్తమై ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో పాటు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

మరుసటి రోజున పర్వత ప్రాంతంలో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. భారీగా కొండచరియలు విరిగిపడటంతో, వంతెన భాగాలు, రోడ్‌బెడ్ కూలిపోయాయని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వంతెన నిర్మాణం పూర్తయిందని కాంట్రాక్టర్ సిచువాన్ రోడ్, బ్రిడ్జ్ గ్రూప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఇదివరకే తెలియజేసింది. ఈ హాంగ్కీ వంతెన షువాంగ్జియాంగ్కో జలవిద్యుత్ ప్రాజెక్టు సమీపంలో ఉంది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎత్తైన ఆనకట్టగా నిలిచే అవకాశం ఉంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ గతంలో నివేదించిన దాని ప్రకారం.. ఈ ప్రాజెక్టు మే 1న నీటిని నిల్వ చేయడం ప్రారంభించింది. జలవిద్యుత్ ప్రాజెక్టు సమీపంలో భూభాగంలో జరిగిన మార్పులు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలు ప్రాజెక్టు భద్రతపై కూడా ఆందోళనలు పెంచుతున్నాయి.

Advertisement

ఈ వంతెన మార్గాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఎటువంటి అంచనా సమయం లేదని స్థానిక అధికారులు తెలిపారు. ప్రకృతి విపత్తు కారణంగా ఈ సంఘటన జరిగినప్పటికీ.. దేశంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో కూడా పర్యావరణపరమైన, భూభాగ స్థిరత్వ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×