E-Paper
Advertisement

China: ప్రియురాలికి రూ.25 కోట్లు ఇచ్చి చనిపోయిన భర్త.. కోర్టు మెట్లెక్కిన భార్య, తీర్పు విని అంతా షాక్!

China: ప్రియురాలికి రూ.25 కోట్లు ఇచ్చి చనిపోయిన భర్త.. కోర్టు మెట్లెక్కిన భార్య, తీర్పు విని అంతా షాక్!
Advertisement

China: చైనాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యకు తెలియకుండా.. మరో మహిళతో సంబంధాన్ని కొనసాగించాడు. ఆమెకు సీక్రెట్ గా రూ.25 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఇటీవల అతడు మరణించిన తర్వాత భార్యకు అసలు విషయం తెలిసింది. దీంతో ఆమె కోర్టుకెక్కింది. ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

షాంఘైకి చెందిన షెన్ అనే చైనీస్ మహిళ జులై 1999లో జిన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. జిన్ మే 2022లో మరణించాడు. అయితే జిన్… మరో మహిళతో సంబంధం కొనసాగించాడు. ఈ విషయం భార్య షెన్ కు తెలియలేదు. జిన్ మరణించిన తర్వాత అతడి వస్తువులను షెన్ పరిశీలిస్తున్నప్పుడు.. 2015 నుండి టావో అనే మహిళతో సంబంధంలో ఉన్నట్లు తెలిసింది. ఏడు ఏళ్లలో జిన్ రహస్యంగా 19 మిలియన్ యువాన్లకు పైగా (రూ. 25 కోట్లకు పైగా) టావోకు ట్రాన్స్ ఫర్ చేశాడు.

ప్రియురాలిపై కేసు

Advertisement

తన భర్త భారీ మొత్తంలో డబ్బును మరో మహిళకు బదిలీ చేయడంతో.. షెన్, ఆమె పిల్లలు టావోపై కోర్టుకెళ్లారు. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక విచారణలో.. టావో డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉందని, ఇంత పెద్ద మొత్తంలో వైవాహిక ఆస్తులను వేరొకరికి ఇవ్వడానికి జిన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చింది. టావో ఇప్పటికే జిన్‌కు 5.4 మిలియన్ యువాన్లు (రూ.7 కోట్లు) తిరిగి చెల్లించింది. మిగిలిన 14 మిలియన్ యువాన్ (రూ.18 కోట్లు) షెన్‌కు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Also Read: హనుమాన్ విగ్రహం చుట్టూ వీధి కుక్క ప్రదక్షిణలు.. 36 గంటలుగా తిరుగుతున్న వీడియో వైరల్

అప్పీల్‌ను తిరస్కరించిన కోర్టు

Advertisement

అయితే ఈ తీర్పుపై టావో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. టావో అప్పీల్ షాంఘై పీపుల్స్ కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును సమర్థించింది. జిన్ టావో మధ్య వివాహేతర సంబంధంలో ఉండడంతో.. తీసుకున్న డబ్బు షెన్ ఆర్థిక హక్కులను ఉల్లంఘన కిందకు వస్తాయని కోర్టు తేల్చింది. ఇలాంటి చర్యలు ప్రజా నైతికత, సామాజిక నైతికతను కూడా ఉల్లంఘించడమేనని పేర్కొంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×