E-Paper
Advertisement

Dewald Brevis: కండ‌లు చూపిస్తూ రెచ్చ‌గొట్టిన బౌల‌ర్‌..రివేంజ్ తీర్చుకున్న CSK బ్యాట‌ర్‌

Dewald Brevis: కండ‌లు చూపిస్తూ రెచ్చ‌గొట్టిన బౌల‌ర్‌..రివేంజ్ తీర్చుకున్న CSK బ్యాట‌ర్‌
Advertisement

Dewald Brevis: క్రికెట్ లో గొడవలు జరగడం చాలా కామన్. క్రికెటర్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడమే కాదు.. అప్పుడప్పుడు ఇద్దరు తిట్టుకోవడం కూడా జరుగుతుంది. కొన్నిసార్లు కొట్టుకునే దాకా వస్తుంది. ఐపీఎల్లో శ్రీశాంత్ లాంటి పెద్ద ఆటగాడిని హర్భజన్ సింగ్ చెంప చెల్లుమనేలా కొట్టిన సంగతి తెలిసిందే. అలాగే క్రికెట్ లో బ్యాటర్ ను బౌలర్ లేదా అదే బౌలర్ ను బ్యాటర్ రెచ్చగొట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే సరిగ్గా ఇలాంటి సంఘటనే సౌత్ ఆఫ్రికా T20 లీగ్ 2026 టోర్నమెంట్ లో ( South Africa T20 League 2026 Tournament ) జరిగింది. అదికూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి కొత్తగా వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ ( Dewald Brevis ) వర్సెస్ జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ డోనోవన్ సాఫ్ట్‌వేర్ ( Donovan Ferreira ).

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ను గెలికిన బౌలర్

Advertisement

సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ 2026 టోర్నమెంట్ లో ( South Africa T20 League 2026 Tournament ) భాగంగా తాజాగా జోబర్గ్ సూపర్ కింగ్స్ vs ప్రిటోరియా క్యాపిటల్స్ ( Joburg Super Kings vs Pretoria Capitals ) మధ్య మ్యాచ్ జరిగింది. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా జరిగిన 28వ మ్యాచ్ ఇది. ఇందులో అద్భుతంగా రాణించిన ప్రిటోరియా క్యాపిటల్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు డెవాల్డ్ బ్రెవిస్ ( Dewald Brevis ) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో డెవాల్డ్ బ్రెవిస్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ డోనోవన్ సాఫ్ట్‌వేర్. జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ డోనోవన్ సాఫ్ట్‌వేర్ ( Donovan Ferreira ) వేసిన ఓ బంతిని బలంగా కొట్టే ప్రయత్నం చేశాడు డెవాల్డ్ బ్రెవిస్.

అయితే ఆ సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు డోనోవన్ సాఫ్ట్‌వేర్. నా బౌలింగ్ లో నువ్వు సిక్సర్ కొట్టలేవు… నీకు అంత సీన్ లేదు.. నా బౌలింగ్ లో కొట్టాలంటే కండలు కావాలి… నీకు కండలే లేవు అంటూ డెవాల్డ్ బ్రెవిస్ ను స్లెడ్జింగ్ చేశాడు డోనోవన్ సాఫ్ట్‌వేర్. అయితే దానికి వెంటనే కౌంటర్ ఇచ్చాడు డెవాల్డ్ బ్రేవిస్‌. జోబర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ డోనోవన్ సాఫ్ట్‌వేర్ బౌలింగ్ లో వరుసగా నాలుగు బంతుల్లో 20 పరుగులు కొట్టాడు బ్రెవిస్‌. 4,6,4,6 ఇలా వరుసగా 20 పరుగులు సాధించాడు. ఇలా ఈ ఓవర్ లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఈ సంఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనను స్వయంగా తన ఫోన్ లో డెవాల్డ్ బ్రెవిస్‌ చూసుకుని నవ్వుకున్నాడు.

Advertisement

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

 

 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×