నిత్యం హోటళ్లు, రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరుపుతున్నప్పటికీ, యాజమాన్యాల తీరు ఏమాత్రం మారడం లేదు. గల్లీ హోటళ్లు మొదలుకొని పేరు మోసిన హోటళ్ల వరకు ఇదే పరిస్థితి. చాలా హోటళ్లలో కనీస శుభ్రత కనిపించడం లేదు. కల్తీ వ్యవహారాలూ తగ్గలేదు. కుళ్లిన మాంసం, ఇతర ఫుడ్ కలర్స్, జంతువుల ఎముకల నుంచి తీసిన నూనెల వినియోగం కొనసాగుతూనే ఉంది. నిర్వాహకులు అజాగ్రత్త, ధనదాహానికి కస్టమర్లు బలవుతున్నారు. కల్తీ వంట సామాన్లే ప్రాణాలకు ముప్పు అనుకుంటే, తినే ఫుడ్ లో పురుగులు, బొద్దింకలు కూడా దర్శనం ఇస్తున్నాయి. తాజాగా ఓ పేరు మోసిన రెస్టారెంట్ లో కస్టమర్ కు షాకింగ్ ఇన్సిడెంట్ ఎదురయ్యింది.
బిర్యానీలో బొద్దింక
ఈ నెల 17న విజయం అనే యువకుడు తన మిత్రులతో కలిసి బయటకు వచ్చాడు. నెక్ లెస్ రోడ్డు పరిసరాల్లో హ్యాపీగా చాలాగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత అందరూ కలిసి బిర్యానీ తినాలి అనుకున్నారు. అక్కడే ఉన్న రైల్ కోచ్ రెస్టారెంట్ కు వెళ్లారు. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. కాసేపట్లోనే సర్వర్ వేడివేడి బిర్యానీ తీసుకొచ్చాడు. రుచికరమైన బిర్యానీని లొట్టలేసుకుంటూ తినడం మొదలు పెట్టారు. సంగం బిర్యానీ తినగానే విజయ్ షాక్ అయ్యాడు. తన్ ప్లేట్ లో బిర్యాని మధ్యలో పెద్ద బొద్దింక కనిపించడంతో స్టన్ అయ్యాడు. వెంటనే వాష్ రూమ్ లోకి వెళ్లి వాంతి చేసుకున్నాడు.
రెస్టారెంట్ నిర్వాహకులను నిలదీసిన విజయ్
బిర్యానీలో బొద్దింకరావడంపై విజయ్ సీరియస్ అయ్యాడు. ప్లేట్ తీసుకెళ్లి మేనేజర్ కు చూపించి ఇదేంటని దుమ్ముదులిపాడు. తప్పు తమ వైపు ఉండటంతో యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రెస్టారెంట్ సిబ్బంది సైతం సైలెంట్ అయ్యారు. ఇక బిర్యాలో బొద్దింక కనిపించిన ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం జరిగిన విషయాన్ని విజయ్ ఫిర్యాదు రూపంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు అందించాడు. శుభ్రత పాటించని రైల్ కోచ్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. రెస్టారెంట్ ను పూర్తి స్థాయిలో తనిఖీ నిర్వహించి, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు హోటల్స్ పై చర్యలు తీసుకుంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఈ రెస్టారెంట్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి రెస్టారెంట్స్ మీద చర్యలు తీసుకుంటేనే, మిగతా హోటల్స్ భయపడే అవకాశం ఉంటుందంటున్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైల్ కోచ్ రెస్టారెంట్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
#Hyderabad—#Cockroach found in #Biryani at Rail Coach Restaurant on #NecklaceRoad.
The customer identified as Vijay
went to the restaurant with his friends to have biryani.A cockroach came out after eating half-a-biryani. The customer who found the insect in the biryani,… pic.twitter.com/eDMk3ZWMUQ
— NewsMeter (@NewsMeter_In) March 18, 2025
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
అటు విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో కొద్ది సేపట్లోనే వైరల్ అయ్యింది. చూడటానికి వెరైటీగా ఉందని నెక్లస్ రోడ్లోని రైల్ కోచ్ రెస్టారెంట్ కు వెళ్తే.. ఆస్పత్రిలో బెడ్ బుక్ చేసుకోవాల్సిందే అని ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: రెండు చేతుల్లేవ్.. గుండె బరువెక్కిస్తున్న జొమాటో బాయ్ వీడియో!