Food Delivery Man Heart Touching Video: ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. చేసే పని ఎంత బాగా చేస్తున్నాం అనేది ముఖ్యం. కానీ, ఈ రోజుల్లో కుర్రాళ్లు తన స్థాయికి తగ్గ ఉద్యోగం రావడం లేదని బాధపడుతున్నారు. మరికొంత మంది చిన్న చిన్న పనులు చేయడం ఏంటని నామోషీ పడుతున్నారు. ఇంకొంత మంది ఏ పనీ దొరకడం లేదని తెగ ఇదై పోతుంటారు. ముప్పై ఏండ్లు దాటినా తల్లిదండ్రుల కష్టం మీదే కాలం వెళ్లదిసేవాళ్లు ఎందరో. అలాంటి వాళ్లంతా ఈ వీడియోను ఒక్కసారి చూడండి. ఇప్పటికైనా మీ మనసు మారుతుందేమో? అకాశం రాకపోవడం కాదు, ఏ అవకాశం లేకపోవడం అసలైన అవకాశం అని తెలుసుకుంటారేమో? అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? సమాజంలో బతికేందుకు ఎలా పోరాడుతున్నాడు? అని ఒక్కసారి ఆలోచించండి..
చేతులు లేకపోయినా బతుకు పోరాటం చేస్తూ..
ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తికి సుమారు 40 ఏండ్లు ఉంటాయి. ఏం జరిగిందో తెలియదు గానీ, రెండు చేతులు లేవు. అయినప్పటికీ, తను ఎవరి మీద ఆధార పడటం లేదు. సొంత కాళ్ల మీద నిలబడి జీవిస్తున్నాడు. జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. వచ్చిన డబ్బుతో ఆత్మగౌరవడంతో బతుకుతున్నాడు. చేతులు పోయాయి. కానీ, ఆత్మాభిమానం పోలేదని నిరూపించుకుంటున్నాడు. అతడు ఓ ఫుడ్ ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్తుండగా ఓ వ్యక్తి తనను వీడియో తీశాడు. “బైక్ నడపగలుగుతున్నారా?” అనడంతో.. నవ్వుతూ “నడుపుత”న్నాను” అని సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించింది. లక్షల కొద్ది లైకులు అందుకుంది. వేలాది కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. అయితే, అతడి పేరేంటి? ఢిల్లీలో ఎక్కడ ఉంటాడు? అనే విషయాలు మాత్రం ఈ వీడియోలో వెల్లడించలేదు.
Massive RESPECT for This Zomato Delivery Man 🙏🙏 pic.twitter.com/Y0WtX88aGY
— Rosy (@rose_k01) October 25, 2024
Read Also: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారికి ఇలా చుక్కలు చూపించండి.. సజ్జనార్ సలహా!
ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
ఇక ఈ జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇలాంటి వారిని చూసినప్పుడే నాకు బతుకు మీద ఓ ఆశ కలుగుతుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “వాళ్లను చూసి జాలి పడే బదులు, మనల్ని మనం ఓసారి ప్రశ్నించుకోవాలి. అన్నీ సక్రమంగా ఉండీ ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి” అని మరో వ్యక్తి రియాక్ట్ అయ్యాడు. “అన్ని అవయవాలు సరిగ్గా ఉండి, ఏ పని చేతగాని సోమరిపోతులు ఈ వీడియో చూసిన తర్వాత అయినా మారుతారేమో చూడాలి” అని మరో వ్యక్తి రియాక్ట్ అయ్యాడు. మొత్తంగా చేతులు లేకపోయినా సంకల్ప బలంతో ముందుకుసాగుతున్న ఈ జొమాటో డెలివరీ బాయ్ ఎంతో మందిని స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. ఏ పని చేతగాని వారిలోనూ ఏదో ఒక పని చేసుకుని సగర్వంగా బతకాలనే కాన్ఫిడెన్స్ నింపుతున్నాడు. ఎంతో మంది ఆలోచనలలో మార్పుకు కారణం అవుతున్నాడు.
Read Also: ఇదెక్కడి మోసం మామా.. 22 ఫేక్ ఎంప్లాయిస్ తో రూ.18 కోట్లు కొట్టేసిన హెచ్‌ఆర్!