Tim Seifert – Shaheen Afridi: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పూర్తి అయిన.. తర్వాత న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరుగుతోంది. ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే మొదటి టి20 పూర్తిగా తాజాగా రెండవ టి20 కూడా జరిగింది. ఇందులో కూడా న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. యూనివర్సిటీ ఓవల్ వేదికగా జరిగిన ఈ రెండో టి20 మ్యాచ్ లో…. పాకిస్తాన్ జట్టుపై… న్యూజిలాండ్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో ఏకంగా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ న్యూజిలాండ్.
అయితే… ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ స్టార్ ఆటగాడిగా పేరుపొందిన షాహిన్ ఆఫ్రిది ఇజ్జత్ తీశాడు న్యూజిలాండ్ ఆటగాడు. షాహిన్ ఆఫ్రిది… వేసిన ఒక ఓవర్ లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సెయ్ ఫెర్ట్. పాకిస్తాన్ పై జరిగిన మ్యాచ్ లో టిమ్ సెయ్ ఫెర్ట్…. 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 5 సిక్సర్లు, మూడు బౌండరీలు కూడా ఉన్నాయి. 205 స్ట్రైక్ రేట్ తో….. దుమ్ము లేపాడు టిమ్ సెయ్ ఫెర్ట్.
ముఖ్యంగా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది బౌలింగ్లో ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టాడు ఈ న్యూజిలాండ్ డేంజర్ ఆటగాడు. దీంతో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. నెంబర్ వన్ బౌలర్ గా చెప్పుకునే షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఓ బచ్చా క్రికెటర్ నాలుగు సిక్సర్లు కొట్టడం… చాలా దారుణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షాహిన్ అఫ్రిది ఇజ్జత్ మొత్తం తీశాడని…. కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. నెంబర్ వన్ బౌలర్ కే ఇలా.. ఉంటే… సాధారణ బౌలర్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా…. ఈ మ్యాచ్ లో.. ఏకంగా 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్ జట్టు. ఈ మ్యాచ్ కు మొదట వర్షం అడ్డంకిగా మారింది. దీంతో 15 ఓవర్ల కు మ్యాచ్ ను కుదించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీ… నిర్ణీత 15 ఓవర్లలో… 9 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా ఒక్కడే అద్భుతంగా రాణించి జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ 46 పరుగులు చేసి దుమ్ములేపాడు. అటు శభాద్ ఖాన్ , షాహిన్ ఆఫ్రిది కూడా అద్భుతంగా ఆడారు..
ఇక పాకిస్తాన్ కుదించిన 136 పరుగుల లక్ష్యాన్ని… అవలీలగా చేదించింది న్యూజిలాండ్. 13.1 ఓవర్లలో కేవలం 5 వికెట్లు నష్టపోయి చేధించింది. ఈ తరుణంలోనే… ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్. న్యూజిలాండ్ ప్లేయర్ లలో ఫిన్ అల్లెన్, న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సెయ్ ఫెర్ట్… ఇద్దరు అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు. అయితే ఇక్కడ… పాకిస్తాన్ ప్లేయర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో న్యూజిలాండ్ ఆటగాడు 4 సిక్సర్లు పెట్టడమే ఇప్పుడు హాట్ టాపిక్.. కావడం జరిగింది.
TIM SEIFERT SMASHING 4 SIXES IN AN OVER AGAINST SHAHEEN AFRIDI. 🥶pic.twitter.com/Q4jcTTW9Ar
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2025