BigTV English

Robinhood: పడిపోయిన నితిన్ గ్రాఫ్.. రాబిన్ హుడ్ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

Robinhood: పడిపోయిన నితిన్ గ్రాఫ్.. రాబిన్ హుడ్ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

Robinhood..టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నితిన్ (Nithin) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు వరుస హిట్స్ అందుకొని, భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్.. ఇప్పుడు అదే హిట్ కోసం పాకులాడుతున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా వరుస ఫ్లాప్స్ ఎదుర్కోవడంతో.. ఆ ప్రభావం తన మార్కెట్ పై పడింది. అందుకే ఎలాగైనా సరే మార్కెట్ పెంచుకోవడానికి సరైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నారు నితిన్. ఈ క్రమంలోనే తాజాగా నితిన్ నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్ (Robinhood) . త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించవచ్చు అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


హీరో నితిన్ 2020లో వచ్చిన ‘భీష్మ’ సినిమాతో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టిన ఈయన.. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో తీవ్ర నిరాశకు గురయ్యారు.ముఖ్యంగా ఈయన సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే వస్తున్నా.. కనీసం యావరేజ్ టాక్ వచ్చినా.. ఓవరాల్ గా నష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇక ఇప్పుడు ఈ పతనానికి బ్రేక్ వేయాలని నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే నితిన్ – వెంకీ కుడుముల (Venky kudumula) హిట్ కాంబో కావడంతో ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి. ఎందుకంటే భీష్మ లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ ఇప్పుడు అదే కాంబోలో ఈ సినిమా రాబోతోంది. నితిన్ కెరియర్ ను గాడిలో పెట్టే అవకాశం ఉందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

ALSO READ:Sunitha Williams : 9 నెలల అంతరిక్ష జీవితం… త్వరలోనే తెర మీదకు సునీతా విలియమ్స్ బయోపిక్..


దీనికి తోడు మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కనీసం రూ.30 కోట్ల షేర్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే దీనికి ప్రాముఖ్యత ఏమిటంటే నితిన్ గత సినిమాల రిజల్ట్ చూస్తే రూ.30 కోట్ల మార్క్ అందుకోవడం అంత తేలికైన పని కాదు అని చెప్పాలి. ఎందుకంటే మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, చెక్ చిత్రాలు కేవలం రూ.10 కోట్లు మాత్రమే రాబట్టాయి. నిజానికి ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన చిత్రం ‘అ ఆ’.. తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో హిట్ పడలేదు. కానీ ఒకవేళ రాబిన్ హుడ్ మాత్రం పాజిటివ్ టాక్ వస్తే రూ.50 కోట్లు ఈజీగా రాబట్టగలడు నితిన్ .కాబట్టి ఎక్స్ట్రా ఆర్డినరీ ఇచ్చిన డిజాస్టర్ నుండి బయటకు రావాలి అంటే ఇప్పుడు నితిన్ సాలిడ్ హిట్టు అందుకోవాలి. దీనికి తోడు ఇప్పటివరకు రాబిన్ ఫుడ్ నుండి విడుదలైన టీజర్, పాటలు కేవలం మిక్స్డ్ రెస్పాన్స్ మాత్రమే తెచ్చుకున్నాయి. అటు మేకర్స్ కూడా సినిమా ఫన్నీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, థియేటర్లలో కామెడీ వర్కౌట్ అయితే హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. అసలే మ్యాడ్ స్క్వేర్ హిట్ సినిమాతో సినిమా పోటీ పడడం కొంత ఇబ్బందిని కలిగించవచ్చని, ఒకవేళ నితిన్ వెంకీ కుడుముల మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తే రాబిన్ హుడ్ తో మళ్లీ నితిన్ సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉందని, సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి దీనిపై ఆడియన్స్ ఎలా తీర్పు ఇస్తారో అన్నది తెలియాలంటే, మార్చి 28 వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×