సుమారు 45 ఏళ్ల వయసున్న మహిళ. పక్షపాతం వచ్చింది. భారీ వర్షం కురుస్తుంది. రోడ్డు పక్కన ఉన్న చిన్న షెల్టర్ లో కూర్చొని ఉంది. ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయలో తనకు తెలియదు. తినడానికి ఫుడ్ కూడా లేదు. ఆమెను గమనించిన ఓ భారతీయ కుర్రాడు పలకరించాడు. ఆమె బాధ విని చలించి పోయాడు. తన కూతురు దగ్గరికి వెళ్లాలనని ఉందని చెప్పింది. వెంటనే తన కారులో ఆ కుర్రాడు ఆమెను కూతురు ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భారీ వర్షంలో రోడ్డు పక్కన ఉన్న మహిళను ఇండియన్ కుర్రాడు నోహ్ గమనించాడు. ఆమెకు ఏదైనా సాయం చేయాలనుకున్నాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లాడు. “చాలా పెద్ద వర్షం కురుస్తుంది. ఈ టైమ్ లో మీరు ఎక్కడికి వెళ్తారు? ఈ రాత్రి సమయంలో నేను మీకు ఏదైనా సాయం చేయగలనా?” అని అడుగుతాడు. వెంటనే సదరు మహిళ “ఈ సమయంలో తన కూతురు దగ్గరికి వెళ్లాలని ఆమె చెప్పింది. వెంటనే ఆమెను నా కారులో తీసుకెళ్లి ఆమె కూతురు ఇంటి దగ్గర సురక్షితంగా దింపేశాను. కొన్నిసార్లు, దయ మాత్రమే జీవితాన్ని మార్చడానికి అవసరం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చాలా మంది నోహ్ చూపించిన దయను ప్రశంసిస్తున్నారు.
Read Also: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!
నోహ్ చేసింది చిన్న సాయమే అయినప్పటికీ, అతడు చూపించిన ప్రేమ అందరినీ ఆకట్టుకుంటుంది. “నువ్వో నిజమైన హీరో” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “దేవుడు నిన్ను దీవించాలి. నీలాంటి వారి ఫ్రెండ్స్ నాకూ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “విదేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడు ఇతడి లాగే ఉండాలి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. మీరు సాయం చేసిన తర్వాత మీ పేరుతో పాటు, మీది ఇండియా అని చెప్పండి. ఇది వారి మనస్సులో మన దేశం మీద మంచి అభిప్రాయం కలిగేలా చేస్తుంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “నువ్వు చాలా మంచి పని చేశావు. దేవుడు నిన్న ఎప్పుడూ చల్లగా చూడాలి. నీకూ అత్యవసర సమయాల్లో ఇలాంటి సాయం అందాలని కోరుకుంటున్నాను” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి ఈ వీడియోపై విమర్శలు చేశాడు. “ముందుగా ప్లాన్ చేసే వీడియో షూట్ చేస్తూ, ఆమెకు సాయం చేశావా? లేదంటే సోషల్ మీడియా ద్వారా వైరల్ కావాలని అలా చేశావా?” అని ప్రశ్నించాడు. మొత్తంగా నోహ్ చేసిన పనిని కొంత మంది ప్రశంసిస్తుండగా, మరికొంత మంది విమర్శలు చేస్తున్నారు.
Read Also: పండ్లు, కూరగాయల మీద పండించిన రైతుల ఫోటో.. ఎంత మంచి నిర్ణయమో!