BigTV English
Advertisement

Doppelganger: మనిషిని పోలిన ఏడుగురు నిజంగానే ఉంటారా? సైన్స్ ఏం చెప్తుందో తెలుసా?

Doppelganger: మనిషిని పోలిన ఏడుగురు నిజంగానే ఉంటారా? సైన్స్ ఏం చెప్తుందో తెలుసా?

Doppelganger: మనలాగే మరొకరు ఈ ప్రపంచంలో ఉంటారనే ఆలోచన చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఒకే పోలికతో ఎడుగురు ఉంటారని చాలా మంది చెప్తారు. ‘అరే.. అచ్చం నాలాగే ఉండే మనిషిని చూశాను’ అని మరికొందరు అంటారు. వినడానికి ఇది చాలా బాగుంటుంది. కొన్ని సార్లు సెలబ్రిటీలు, పలువురు ప్రముఖుల పోలికలతో కొందరు కనిపిస్తారు. వీళ్లను కాస్త ఎక్కువగా పరిశీలిస్తే పోలికలు మాత్రం ఉంటాయి. కానీ, అచ్చు గుద్దినట్లుగా ఒకేలాగా ఉండడం మాత్రం చాలా అరుదు.


అయితే, నిజంగానే చూడడానికి అచ్చం మనలాగే ఉండేవారు ఏడుగురు ఉంటారా? అనే
సందేహం వస్తే అచ్చం మన లాగే ఉన్న మనిషిని ఒక్కసారైనా చూడాలని అనిపిస్తుంది కదూ? సినిమాల్లో, కథల్లో మనిషిని పోలిన వాళ్ల గురించి చాలానే చూస్తాం. కానీ, నిజ జీవితంలో ఇది నిజంగా జరుగుతుందా? ఉంటే ఒక్కసారైనా కనిపిస్తే బాగుండేది అని చాలా మంది అనుకుంటారు. సైన్స్ దీని గురించి ఏం చెప్తుందో చూద్దాం!

మనలాగే కనిపించే వ్యక్తిని ఇంగ్లీష్‌లో ‘డోపెల్‌గ్యాంగర్’ అంటారు. ఈ పేరు జర్మన్ నుంచి వచ్చింది. డోపెల్‌గ్యాంగర్ అంటే, ఒక వ్యక్తిని పోలి ఉండే మరో వ్యక్తి అని అర్థం.


సైన్స్ ఏం చెబుతోంది?
మన రూపం మన DNA మీద ఆధారపడి ఉంటుంది. ఈ DNA అనేది మన ముఖం, శరీరం ఎలా ఉంటాయో డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో 8 బిలియన్ల మంది ఉన్నారు. ఇంతమందిలో ఇద్దరు ఒకేలా ఉండే ఛాన్స్ ఉందా? సైన్స్ చెప్పేది ఏంటంటే, ఇది చాలా రేర్, కానీ అసాధ్యం మాత్రం కాదని సైన్స్ చెబుతోంది.

ఇద్దరు వ్యక్తులు సరిగ్గా ఒకేలా కనిపించాలంటే, వాళ్ల DNAలో కొన్ని పార్ట్స్ దాదాపు సేమ్‌గా ఉండాలి. కానీ, DNAలో చిన్న తేడా వచ్చినా ముఖంలో పెద్ద మార్పు కనిపిస్తుంది. అందుకే, ఒకేలా ఉండే వాళ్లు ఉండే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే కవలలు కూడా ఒకేలా ఉంటారు. కానీ, చిన్న చిన్న తేడాలు ఉంటాయి.

2015లో ఒక ఫోటోగ్రాఫర్, ఫ్రాన్స్‌వా బ్రూనెల్, ఒకేలా కనిపించే వాళ్లను కలిసి వాళ్ల ఫోటోలు తీశాడు. ఈ ప్రాజెక్ట్‌లో ఒకరినొకరు ఎప్పుడూ కలవని వాళ్లు ఉన్నారు. కానీ, వీళ్లలో చూడడానికి సరిగ్గా ఒకేలా కనిపించే వాళ్లు ఉన్నారు. ఇది చూస్తే, ‘డోపెల్‌గ్యాంగర్‌లు నిజంగా ఉంటారేమో!’ అనిపిస్తుంది.

ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకేలా కనిపించే వాళ్లు బంధువులు కానవసరం లేదని సైన్స్ చెబుతోంది. కొన్నిసార్లు DNA కాంబినేషన్ రాండమ్‌గా ఒకేలా కనిపించే ముఖాల్ని క్రియేట్ చేస్తుందట. కానీ, దగ్గరగా చూస్తే చిన్న చిన్న తేడాలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

టెక్నాలజీతో గుర్తుపట్టడం సాధ్యమేనా?
దీని గురించి ఎన్నో పరిశోధనలు జరిగి, అనేక థియరీలు వచ్చినప్పటికీ చాలా చిక్కుముడులు డౌట్స్‌గానే మిగిలిపోయాయి. దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఇప్పుడు టెక్నాలజీ కూడా హెల్ప్ చేస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో ఒకేలా కనిపించే వాళ్లను ఫైండ్ చేసేందుకు టెక్ నిపుణులు ట్రై చేస్తున్నారు. కానీ, ఈ సాఫ్ట్‌వేర్ కూడా 100 శాతం పని చేస్తుందని చెప్పలేం.

ఏదైనా ఫోటో అప్‌లోడ్ చేస్తే అందులో ఉండే పోలికల ద్వారా కొన్ని ముఖాలను మ్యాచ్ చేసేందుకు ఈ కొన్ని రకాల యాప్‌లు పని చేస్తాయి. కానీ, వీటి ద్వారా అచ్చం మనలాగే ఉండే మనిషిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఫలితాల్లో చూపించే ముఖాలు మన లాగా ఉండవు. అందుకే నిజంగానే మనల్ని పోలిన మనుషులు ఉన్నా వారిని కనిపెట్టడం మాత్రం కాస్త కష్టమనే చెప్పాలి.

ఇప్పుడు AI టెక్నాలజీ వచ్చిన తర్వాత దీన్ని నమ్మడానికి ఒకటికి రెండు సార్లు ఆటోచించాల్సి వస్తోంది. నిజంగానే మన లాగే ఉండే మనిషి ఉన్నారా? లేదా AI ద్వారా మన ఫోటోలనే డోపెల్‌గ్యాంగర్‌ లాగా క్రియేట్ చేశారా? అనే సందేహాలు వస్తున్నాయి.

మొత్తానికైతే డోపెల్‌గ్యాంగర్‌ల గురించి సైన్స్ సూపర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. మనలాగే ఒకరు ఉండే ఛాన్స్ చాలా తక్కువ, కానీ పూర్తిగా ఇంపాసిబుల్ కాదు అని సైన్స్ చెబుతోంది.

Related News

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Big Stories

×