BigTV English

Balakrishna : అఖండ 2 సెట్ లోనే మరో సినిమా ఫిక్స్.. స్క్రిప్ట్ మీ ఊహకే వదిలేస్తున్నా..

Balakrishna : అఖండ 2 సెట్ లోనే మరో సినిమా ఫిక్స్.. స్క్రిప్ట్ మీ ఊహకే వదిలేస్తున్నా..

Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2. బోయపాటి శ్రీను తో బాలకృష్ణ చేసే మూవీస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సింహా, లెజెండ్, అఖండ 1 ఇప్పుడు అఖండ 2. ప్రతిదీ బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డు సృష్టించిన సినిమాలే, అఖండ మొదటి భాగం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు దానికి సీక్వెల్ గా అఖండ 2 తాండవం అంటూ థియేటర్లోకి రానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ సినిమా సైట్స్ పై ఉండగానే బాలకృష్ణ మరో డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ బాలకృష్ణ ఏ డైరెక్టర్ కి నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇవ్వబోతున్నాడో  ఇప్పుడు చూసేద్దాం..


ఆ సెట్ లోనే మరో సినిమా ఫిక్స్..

నందమూరి బాలకృష్ణ, మాస్ యాక్షన్ తో వచ్చిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వస్తున్న మూవీ,ఆఖండ 2పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ ఈ సినిమా సెట్ లోనే మరో డైరెక్టర్ కు నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు గోపీచంద్ మలినేని. తాజాగా బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని జాట్ తో సక్సెస్ ని అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని నెక్స్ట్ బాలకృష్ణ తో మరో మూవీ తీయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన వీర సింహారెడ్డి చిత్రం బాలయ్య అభిమానుల్ని అలరించింది. మరోసారి వీరి కాంబినేషన్లో సినిమా అంటే అది ఎటువంటి రికార్డ్స్ ని తిరగరాస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మూవీ రానున్నట్లు సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ డిస్కషన్ అఖండ 2 సెట్ లోనే పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ షురూ చేయడమే మిగిలి ఉంది. జూన్ 10న బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేసేలా గోపీచంద్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ స్క్రిప్ట్ అభిమానుల ఊహకే వదిలేసారు. ఈ సినిమా వీర సింహారెడ్డి లుక్స్ మించిపోయేలా, గోపీచంద్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్నట్టుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇది తెలుసుకున్న అభిమానులు మరో మాస్ యాక్షన్ చూడబోతున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.


నెక్స్ట్ షెడ్యూల్ అక్కడ ..

ఇక ఆఖండ 2 మూవీ ఇప్పటికే 40% షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను జార్జియాలో జరుగుతుందని అందులో.. బాలయ్య పాల్గొంటారని సమాచారం. ఈ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ తో టాలీవుడ్ హీరో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ ఆఫర్లు భారీగా వస్తున్నాయి. బాలకృష్ణ అఘోరా పాత్రలో అఖండ మొదటి భాగంలో నటించారు. ఇప్పుడు దాని సీక్వెల్ గా అఖండ 2 లో ఆ సినిమాకి కంటిన్యూషన్ గా అదే పాత్రలో కంటిన్యూ అవుతూ విలయతాండవానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మురళీమోహన్, ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. వీరితోపాటు సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, కీలకపాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగం అఖండను మించి ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

 

Nani: హీరోయిన్ ని భయపెట్టిన నాని… షాక్ లో యాంకర్

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×