Lasora Fruits: పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అనేది సామెత.. భారత దేశంలో అతి పురాతన వైద్యం ఆయుర్వేదం.. ఆ వైద్య విధానంలో ఎక్కువగా ప్రకృతి నుంచి లభించే చెట్లు.. ఆకులు కాయలు వంటివే ఔషధాలుగా ఉపయోగిస్తారు. అలాంటి ఔషధ గుణాలు కలిగిన ఓ చెట్టు లాసోరా చెట్టు.. ఈ చెట్టు పండు చూడటానికి అంత ఆకర్శనీయంగా ఉండవు. కానీ ఇది అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘమనే చెప్పాలి.
లసోరా పండ్లనే గ్లూ బెర్రీ లేదా ఇండియన్ చెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. మనకు రహదారుల పక్కన చెట్లకు ఈ కాయలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఇవి ఔషధ గుణాలను కలిగి ఉంటాయన్న విషయం చాలా మందికి తెలియదు. లసోరా పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్‌ను ఈ పండ్లు కలిగి ఉంటాయి. కనుక ఈ పండ్లను తింటే అనేక లాభాలను పొందవచ్చు.
ఎముకల బలం
లసోరా పండులో ఫాస్పరస్, జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. అలాగే విరిగిన ఎముకలు త్వరగా నయమవడానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఇది ఊపిరితిత్తుల వాపును కూడా తగ్గిస్తుంది. లసోరా పండులో యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిక్ గుణాలు, ఇవి షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతాయి, డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. లసోరా పండ్లలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు కండరాలు నిర్మాణం అయ్యేలా చేస్తాయి. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. లసోరా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. కణజాలం దెబ్బ తినకుండా రక్షిస్తాయి, ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
లివర్ సమస్యలను నివారిస్తుంది
లసోరా పండులోని యాంటిఆక్సిడెంట్లు లివర్‌ను శుభ్రం చేస్తాయి, ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా గిరిజన ప్రాంతాలలో లసోడా పండ్లను ఎండబెట్టి మైదా, శెనగపిండి, నెయ్యితో కలిపి లడ్డూలు తయారు చేస్తారు. ఇవి శరీరానికి బలం మరియు శక్తిని ఇస్తాయి. లసోరా పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. బీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. లసోరా పండ్లలో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
లసోరా పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ పండ్లను తింటుంటే అన్ని రకాల కంటి సమస్యలు తగ్గిపోతాయి. లసోరా పండ్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీంతో శరీర వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.
Also Read: లిప్‌స్టిక్ వాడితే ప్రాణాలకే ముప్పు.. జాగ్రత్త మరి..!
లసోడాలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేస్తాయని నమ్ముతారు. ఈ పండ్ల బెరడు మరియు ఆకులను ఎండబెట్టి పొడిగా మార్చవచ్చు, దీనిని ఆయుర్వేద వైద్యంలో కీళ్ల నొప్పులు మరియు వాపు వంటి వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. పంటి నొప్పి విషయంలో, బెరడును నీటిలో మరిగించి చల్లబరిచి తయారుచేసిన కషాయం ఉపశమనం కలిగిస్తుంది. లసోడా ఒక అడవి పండు అని గమనించడం ముఖ్యం, దీనిని పెద్ద పరిమాణంలో తినకూడదు, ఎందుకంటే ఇది నోటి రుచిని అదుపులో ఉంచకుండా చేస్తుంది మరియు కడుపు నొప్పిని కలిగిస్తుంది.