E-Paper
Advertisement

DWCRA Women Clash: రోడ్డుపై కర్రలతో కొట్టుకున్న డ్వాక్రా మహిళలు.. వీడియో వైరల్!

DWCRA Women Clash: రోడ్డుపై కర్రలతో కొట్టుకున్న డ్వాక్రా మహిళలు.. వీడియో వైరల్!
Advertisement

DWCRA Women Clash: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో డ్వాక్రా మహిళా సంఘాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పొదుపు సంఘాల్లో ఉండి ఐక్యతగా ఉండాల్సింది పోయి ఒకరినొకరు కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి వివాదం వెళ్లడం చర్చనీయాంశమైంది.

ఈ గొడవకు ప్రధాన కారణం బ్యాంకు రుణాల చెల్లింపు. డ్వాక్రా సంఘం పేరుతో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను కొందరు సభ్యులు సక్రమంగా నెలవారీ వాయిదాలు చెల్లించడం లేదు. దీనివల్ల గ్రూపు మొత్తం డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉండటంతో పాటు, మిగిలిన సభ్యులపై కూడా ఆ భారం పడుతోంది. వాయిదాలు కట్టాలని మిగిలిన మహిళలు కోరగా.. ఆ విషయంలో సభ్యుల మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

Advertisement

కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రూప్ సభ్యులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఆరుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి.. వారిని చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ వైద్య సేవలు అందుతున్నాయి.

సాధారణంగా ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పడే మహిళా సంఘాల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరం. రుణాల చెల్లింపు విషయంలో పారదర్శకత లేకపోవడం , సభ్యుల మధ్య సమన్వయ లోపం ఇలాంటి పరిస్థితులకు దారితీశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Also Read: : భూపాలపల్లిలో విషాదం.. క్రేన్ తెగిపడి ముగ్గురు కూలీలు మృతి!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×