E-Paper
Advertisement

Viral Video: పబ్లిక్ మీటింగ్.. దేశాధ్యక్షుడిపై వాంతు చేసుకున్న వృద్ధుడు.. అందరూ షాక్!

Viral Video: పబ్లిక్ మీటింగ్.. దేశాధ్యక్షుడిపై వాంతు చేసుకున్న వృద్ధుడు.. అందరూ షాక్!
Advertisement

Viral Video: తైవాన్ లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు లై చింగ్ టె (Lai Ching-te)పై ఓ వృద్ధుడు వాంతు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ అనూహ్య పరిణామంతో తైవాన్ ప్రెసిడెంట్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కార్యక్రమానికి వచ్చిన వారంతా కూడా ఈ ఘటన చూసి షాక్ కు గురయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..

చంద్ర నూతన సంవత్సరం సందర్భంగా తైవాన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తైవాన్ అధ్యక్షుడితో పాటు సాక్రిఫిషియల్ రైట్స్ మార్షల్ టెంపుల్ చీఫ్ లిన్ పీ హువో హజరయ్యారు. నిర్వాహకుల్లో ఒకరు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా అధ్యక్షుడు లై చింగ్ టె పక్కనే లిన్ నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో కాస్త అసౌకర్యానికి గురైన లిన్.. ఒక్కసారిగా వాంతు చేసుకున్నారు. నోటికి అడ్డుగా చేతిని పెట్టినప్పటికీ తుంపర్లు తైవాన్ అధ్యక్షుడి దుస్తులపై పడ్డాయి. దీంతో అక్కడి వారంతా షాక్ కు గురయ్యారు.

Advertisement

ప్రమాదకరమైన వైరస్..!

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనాల ప్రకారం.. లిన్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి నోరో వైరస్ సోకింది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. ఈ క్రమంలోనే లిన్ కూడా అనారోగ్యానికి గురై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. మరోవైపు నోరో వైరస్ సులభంగా వ్యాపిస్తుందని అటు వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. దేశాధ్యక్షుడిపై లిన్ వాంతి చేసుకున్నందున ఆయన ఆరోగ్యంపై కూడా ప్రస్తుతం ఆందోళనలు ప్రారంభమయ్యాయి.

అధ్యక్షుడు ఏమన్నారంటే?

Advertisement

మరోవైపు ఘటన అనంతరం తైవాన్ అధ్యక్షుడు మాట్లాడారు. లిన్ కుటుంబ సభ్యుల్లో కొంతమందికి నోరో వైరస్ సోకిందని ధ్రువీకరించారు. కాబట్టి ఆయన కూడా నోరో వైరస్ బారిన పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తన వల్ల జరిగిన అంతరయానికి లిన్ స్వయంగా క్షమాపణలు చెప్పారు.

Also Read: LG vs Samsung Fully Automatic: ఎల్జీ vs శాంసంగ్.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లలో.. ఫీచర్ల పరంగా దేనిది పైచేయి?

అంటువ్యాధి ప్రబలకుండా..

నోరో వైరస్ ఆందోళన నేపథ్యంలో ఘటనాస్థలిలో అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని శుద్ది చేసేందుకు స్ప్రేలు చల్లారు. ప్రమాదకరమైన నోరో వైరస్.. బాధితుల శరీరం నుంచి వెలువడే తుంపర్లు (దగ్గు, తుమ్ములు, వాంతులు) ద్వారా వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.

Also Read: Best Ceiling Fans 2026: ఏఐతో పనిచేసే స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్స్.. ఈ సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్.. ఏమున్నాయ్ బాసు!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×