E-Paper
Advertisement

Keera Dosa Rates: కిలో కీరదోస రూ.358.. ఎక్కడో తెలుసా?

Keera Dosa Rates: కిలో కీరదోస రూ.358.. ఎక్కడో తెలుసా?
Advertisement

Keera Dosa Rates: ఆ దేశంలో సలాడ్స్, రోజువారీ భోజనంలో కీరదోస తప్పనిసరిగా కనిపిస్తుంది. రాజకీయ అనిశ్చితి, సుదీర్ఘ కాలం పాటు యుద్ధం చేస్తుండడంతో.. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. దీంతో కూరగాయల ధరలు ఆకాశనంటుతున్నాయి. కిలో కీరదోశ రూ.358 చేరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

డిసెంబర్ నుంచి ధరలు రెట్టింపు

రష్యా అధికారిక సమాచారం ప్రకారం, డిసెంబర్ నుంచి కీర దోసకాయల రిటైల్ ధర రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. తాజాగా కిలోగ్రాముకు 300 రూబిళ్లు (సుమారు రూ. 358)కు చేరింది. అయితే, చాలా మంది వినియోగదారులు క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని అంటున్నారు. కొన్ని దుకాణాలలో అధికారిక సగటు కంటే రెండు లేదా మూడు రెట్లు ఎక్కువగా కీర దోసకాయల ధరను ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

రాజకీయ ఒత్తిడి

Advertisement

కూరగాయల ధరలు పెరుగుదల.. ఈ ఏడాది చివర్లో పార్లమెంటరీ ఎన్నికలను ఎదుర్కొంటున్న రూలింగ్ యునైటెడ్ రష్యా పార్టీ సభ్యులకు ఇబ్బందిగా మారింది.
రష్యా అధికార వర్గాలు ధరల ఆకస్మిక పెరుగుదలకు ఉత్పత్తిదారులు, రిటైలర్లను వివరణ కోరింది. ధరల పెరుగుదలతో వినియోగదారులలో అసంతృప్తిని పెంచుతుందనే ఆందోళన అధికారిక పార్టీ నేతల్లో నెలకొంది.

పార్లమెంట్ లో జస్ట్ రష్యా పార్టీ నాయకుడు సెర్గీ మిరోనోవ్ కూరగాయల ధరలు పెరుగుదలపై విమర్శించారు. రష్యన్ దుకాణాలలో కీరదోసకాయలు “కొత్త రుచి”గా మారాయని వ్యాఖ్యానించారు. ఆహార పదార్థాల ధరలను తగ్గించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారన్నారు.

పర్యావరణ మార్పులు

Advertisement

వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణను మిరోనోవ్ విమర్శించారు. ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. గతంలో బంగాళాదుంపల ధరలలో పెరుగుదలను కాలనుగుణంగా ధరలు పెరుగుతుంటాయని మంత్రి వివరణ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదల ఎక్కువగా వాతావరణంపై ఆధారపడి ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పర్యావరణ మార్పులతో దిగుబడి తగ్గుతుందని, ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుందన్నారు. ఉష్ణోగ్రతలు పెరిగి సరఫరా మెరుగుపడటంతో వచ్చే నెలలో ధరలు తగ్గే అవకాశం ఉందని కీరదోస ఉత్పత్తిదారులు తెలిపారు.

ద్రవ్యోల్బణం 5.5 శాతం

కూరగాయల ధరలలో హెచ్చుతగ్గులు సర్వసాధారణం, ఆహార ధరలు పెరిగినప్పుడు రష్యన్ అధికారులు గతంలో జోక్యం చేసుకున్నారని వ్యవసాయ మంత్రి తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం కూరగాయ ధరలు 2.1 శాతం పెరిగాయి. దీనికి విలువ ఆధారిత పన్ను పెరుగుదలతో పాటు, ఉక్రెయిన్‌లో నాలుగు సంవత్సరాల యుద్ధంతో రష్యా ఆర్థిక వ్యవస్థ మందగించడం కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వార్షిక ద్రవ్యోల్బణం 5.5 శాతం వరకు ఉంటుందని కేంద్ర బ్యాంకు అంచనా వేసింది. యుటిలిటీ బిల్లులు, పెరుగుతున్న పెట్రోల్ ధరలు, సూపర్ మార్కెట్, రెస్టారెంట్ ఖర్చులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ సందర్భంలో, కీరదోసకాయ ధరలు రెట్టింపు కావడం వినియోగదారుల్లో మరింత ఆర్థిక ఒత్తిడి నెలకొంది.

Also Read: రష్యా యూనివర్సిటీలో కలకలం.. ఓ వ్యక్తి కత్తితో దాడి, భారతీయ విద్యార్థులకు గాయాలు

దిగుమతి పండ్ల కంటే ఎక్కువ ధర

కొన్ని ప్రాంతాలలో అరటిపండ్లు వంటి దిగుమతి చేసుకున్న పండ్ల కంటే కీరదోసకాయలు ధరలు ఎక్కువగా ఉన్నాయి. సైబీరియాలోని కొన్ని ప్రాంతాలలోని సూపర్ మార్కెట్లు నిల్వలను నివారించడానికి ప్రతి కస్టమర్‌కు కొనుగోలు లిమిట్ ను పెట్టినట్లు సమాచారం. జస్ట్ రష్యా, కమ్యూనిస్ట్ పార్టీతో సహా స్టేట్ డూమాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష పార్టీలు, సూపర్ మార్కెట్లు అవసరమైన ఆహార పదార్థాలకు వర్తించే రిటైల్ మార్క్-అప్‌లపై పరిమితులు విధించాలని కోరాయి.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×