BigTV English

Human Eating: బాబోయ్.. వీళ్లు సొంత కుటుంబ సభ్యులనే తినేస్తారట, ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా?

Human Eating: బాబోయ్.. వీళ్లు సొంత కుటుంబ సభ్యులనే తినేస్తారట, ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా?

Endocannibalism: చనిపోయిన మనుషుల మాంసాన్ని సొంత కుటుంబ సభ్యులు తినడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఊహించుకుంటేనే షాకింగ్ గా ఉన్నా, ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఆచారం ఉన్నది. చరిత్రలో ఈ తరహా ఘటనలు గురించి అనేక ఆధారాలు ఉన్నాయి. కొంతమంది ఆచార్య, వ్యవహారాల్లో భాగంగా చనిపోయిన కుటుంబ సభ్యులు మాంసాన్ని తింటే, మరికొంత మంది కరువు కాటకాల నుంచి బయటపడేందుకు తోటి మనుషుల మాంసం తిన్నసందర్భాలు ఉన్నాయి. సొంత కుటుంబ సభ్యుల మాంసాన్ని తినడాన్ని ఎండోకానిబాలిజంగా పిలుస్తారు. ఈ విధానం ప్రపంచంలో ఎక్కడెక్క ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


చారిత్రక ఆధారాలు

⦿ వారి ప్రజలు (బ్రెజిల్): చనిపోయిన తమ కుటుంబ సభ్యుల మాంసాన్ని ఈ తెగ ప్రజలు తింటారట. అలా తినడం వల్ల చనిపోయిన వారిని గౌరవించినట్లు భావిస్తారు.


⦿ ఫోర్ పీపుల్ (పుపువా న్యూ గినియా): ఆయా వ్యాధుల వ్యాప్తిని నిరోధించేందుకు చనిపోయిన వారిని ఫోర్ ప్రజలు తినే వారట. అలా తినడం వల్ల వ్యాధులు విజృంభించవని ఈ జాతి ప్రజలు భావిస్తారు.

⦿ అజ్టెక్లు (మెక్సికో): ఈ జాతి ప్రజలు చనిపోయిన తమ బంధువుల మాంసాన్ని తింటారు. అంతేకాదు, నరబలి ఇచ్చి అందరూ కలిసి మాంసం తిన్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.

⦿ చైనీస్ రాజవంశం సాంగ్: ఈ వంశానికి చెందిన వాళ్లు నరమాంస భక్షణ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ వంశంలోని వ్యక్తులు తమ తల్లిందండ్రుల మాంసాన్ని తినడాన్ని గౌరవంగా భావించేవారట.

ఆచార వ్యవహారాలు

⦿ ఆస్ట్రేలియన్ సమూహాలు: తమ ఆచారాల్లో భాగంగా మరణించిన బంధువుల మాంసాన్నితినేవారట.

⦿ ఆఫ్రికన్ సంస్కృతులు: చనిపోయిన తమ కుటుంబ సభ్యుల మాంసాన్ని తినడం వల్ల వారి ఆత్మ, బలం తమలోకి వస్తాయని భావించేవారు.

⦿ యానోమామి ప్రజలు(అమెజాన్): చనిపోయిన వారి మాంసాన్ని తినడం వల్ల వారిని గౌరవించినట్లు భావిస్తారట.

కరువు నుంచి బయటపడేందుకు

⦿ ఉక్రేనియన్ హోలోడోమోర్(1932-1933): కరువు కాటకాలు విజృంభించిన సమయంలో చనిపోయిన బంధువుల మాంసాన్ని తిన్నట్లు తెలుస్తున్నది.

⦿ లెనిన్గ్రాడ్ జాతులు(1941-1944): రెండో ప్రపంచ యుద్ధం సమయంలో లెనిన్గ్రాడ్ జాతులు కుటుంబ సభ్యులను తిన్నట్లు అనేక నివేదిలకలు వెల్లడించాయి.

ఇప్పటికీ కొన్ని చోట్ల నరమాంస భక్షణ 

సొంత కుటుంబ సభ్యుల మాంసాన్ని తినడం అనేది చాలా సున్నితమైన అంశంగా భావిస్తున్నారు చరిత్రకారులు. అత్యంత కలవరపెట్టే ఎండోకానిబాలిజం మొత్తం సంస్కృతులు, సంఘాలకు ఆపాదించి చూడకూడదంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నరమాసం భక్షణ అనేది దాదాపు కనుమరుగు అయినట్లు చెప్తున్నారు. అయితే, పూర్తిగా లేదని చెప్పలేమన్నారు. అమెజాన్ లాంటి అడవుల్లలో ఉన్న కొన్ని అటవీ జాతుల ఇప్పటికీ నరమాంసం తింటున్నట్లు తెలిపారు. ఇలాంటి జాతులు ప్రపంచంలో అతి తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలిపారు. అయితే, ఆయా జాతులు ఇప్పటికీ చనిపోయిన తమ కుటుంబ సభ్యులను తినే ఆచారాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ బయటి మనుషులు వారి దగ్గరికి వెళ్లినా చంపి తిన్న సందర్భాలున్నాయంటున్నారు.

Read Also: ఇది జర్నీయా? లేక సైన్స్ ఫిక్షన్ మూవీనా? నెట్టింట వైరల్ అవుతున్న చైనీస్ యువకుడి వీడియో!

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×