BigTV English

Urvashi Rautela: నాకు, బాలకృష్ణకు 34 ఏళ్ల ఏజ్ గ్యాప్, అదే పెద్ద అడ్వాంటేజ్.. హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్

Urvashi Rautela: నాకు, బాలకృష్ణకు 34 ఏళ్ల ఏజ్ గ్యాప్, అదే పెద్ద అడ్వాంటేజ్.. హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్

Urvashi Rautela: బాలీవుడ్‌లో నటించే హీరోయిన్స్ బోల్డ్ కామెంట్స్ చేయడం, ఓపెన్‌గా మాట్లాడడం వారికి అలవాటే. కొన్ని సందర్భాల్లో వారు మామూలుగా చెప్పే మాటలను కూడా ప్రేక్షకులు వేరేలాగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. తాజాగా హీరో, హీరోయిన్స్ మధ్య ఉండే ఏజ్ గ్యాప్ గురించి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) ఓపెన్‌గా మాట్లాడింది. మామూలుగా హీరోలకు చాలా ఏజ్ ఉన్నా కూడా వారిలో సగం వయసున్న హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడం వారికి అలవాటే. దీనిని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఒక్కొక్కసారి ఈ ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ చేసినా వెంటనే సైలెంట్ అయిపోతారు. తాజాగా ఈ విషయంపై ఊర్వశి స్పందించింది.


మొదటి సినిమాలోనే అలా

2013లో విడుదలయిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ అనే మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది ఊర్వశి రౌతెలా. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీ డియోల్, అమృత రావు, ఊర్వశి రైతెలా లీడ్ రోల్స్‌లో నటించారు. అయితే అప్పటికే ఊర్వశికి, సన్నీ డియోల్‌కు దాదాపు 38 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. సన్నీ డియోల్ తనకంటే చాలా సీనియర్. అయినా కూడా తనతో డెబ్యూ చేసే అవకాశం ఊర్వశికి లభించింది. ఇప్పటికీ కూడా తనకంటే వయసులో చాలా పెద్ద అయిన హీరోలతో నటిస్తూ ఏజ్ గ్యాప్‌ను పెద్దగా పట్టించుకోదు ఊర్వశి. త్వరలోనే బాలకృష్ణతో నటించడంపై తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో స్పందించింది ఈ భామ.


Also Read: ఆ హీరోలతో ముద్దులు, నాతో మాత్రం హద్దులు… ప్రియాంక చోప్రాపై సీనియర్ నటుడి కామెంట్స్

ఫ్యాన్ బేస్ ఎక్కువ

‘‘నేను బాలకృష్ణ (Balakrishna) గారితో కూడా జోడీకట్టాను. మా మధ్య కూడా చాలానే ఏజ్ గ్యాప్ ఉంది. ఆయన 60ల్లోనో, 70ల్లోనో ఉన్నారు. ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నవారు కలిసి నటించడం ఇండియా సినిమా చరిత్రలోనే మొదటిసారి అయ్యిండొచ్చు. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే అడ్వాంటేజెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. హీరో వయసులో పెద్ద అయితే ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా చాలానే ఉంటుంది. సినిమాపరంగా అది అతిపెద్ద అడ్వాంటేజ్. కానీ పర్సనల్‌గా మాత్రం అలా కాదు. నేను మాత్రం సినిమాల్లో ఈ ఏజ్ గ్యాప్ గురించి పెద్దగా పట్టించుకోను’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఊర్వశి రౌతెలా. తన మొదటి సినిమాలో సన్నీ డియోల్‌తో నటించడంపై కూడా స్పందించింది.

కొడుకులకంటే చిన్నదాన్ని

‘‘సన్నీ డియోల్‌కు, నాకు 38 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇంత ఏజ్ గ్యాప్ ఉన్నవాళ్లు బాలీవుడ్‌లో కలిసి నటించడం అదే మొదటిసారి. ఇప్పటివరకు నాకు తెలిసి అలా జరగలేదు. నేను ఆయన కొడుకులకంటే చిన్నదాన్ని. ఆ ఏజ్ గ్యాప్‌ను దర్శకుడు సమస్యగా భావిస్తే నేనేం చేయలేను’’ అని చెప్పుకొచ్చింది ఊర్వశి రౌతెలా. బాలీవుడ్ బ్యూటీ అయినా కూడా టాలీవుడ్‌లో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. చివరిగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పుడు ఎన్‌బీకే 109(NBK 109)లో బాలకృష్ణతో కలిసి నటిస్తోంది. ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×