BigTV English

Viral Video: ఇది జర్నీయా? లేక సైన్స్ ఫిక్షన్ మూవీనా? నెట్టింట వైరల్ అవుతున్న చైనీస్ యువకుడి వీడియో!

Viral Video: ఇది జర్నీయా? లేక సైన్స్ ఫిక్షన్ మూవీనా? నెట్టింట వైరల్ అవుతున్న చైనీస్ యువకుడి వీడియో!

టెక్నాలజీలో చైనా రోజు రోజు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటున్నది. ఆకాశాన్ని తాకే భవనాలు, అత్యధునిక రవాణా సౌకర్యం, ఒకటేమిటి భూతల స్వర్గంగా చెప్పుకోవచ్చు. అక్కడి పట్టణాలు చూస్తుంటే కళ్లు చెదిరిపోతాయి. తాజాగా ఓ చైనా యువకుడు తన రోజు వారీ ప్రయాణం ఎలా ఉంటుందో చూపిస్తూ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుమారు నిమిషం పాటు ఉన్న ఈ వీడియో అచ్చం సైన్స్ ఫిక్షన్ మూవీని తలపిస్తున్నది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందో మీరూ చూసేయండి..


18వ అంతస్తులో ఇల్లు.. 22వ అంతస్తులో ఆఫీస్..

నగరాల్లో ప్రయాణం అంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్స్ తీవ్రంగా విసిగిస్తాయి. ఆఫీస్ కు లేట్ అవుతుందని టెన్షన్ పెడుతాయి. కానీ, ఓ చైనా యువకుడు షేర్ చేసిన వీడియోను చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. అంతేకాదు, ఓ సైన్స్ ఫిక్షన్ మూవీని చూసినట్లుగా  ఉంటుంది. సదరు చైనీస్ యువకుడు 18వ అంతస్తులో ఉంటాడు. అక్కడి నుంచి తన ప్రయాణం మొదలవుతుంది. దానికి ఎలివేటర్ సౌకర్యం ఉండదు. కానీ, ఆ భవనం గ్రౌండ్ లోనే 12 అంతస్తులు ఉంటాయి. సో, ఆయన కేవలం 6 ఫ్లోర్లు కిందికి దిగితే సరిపోతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో నివసించే వారికి సూర్యరశ్మిని బంగారంలా భావిస్తారని చెప్పాడు. అక్కడి నుంచి నెమ్మదిగా ఓ సబ్ వేలోకి ఎంటర్ అవుతాయి. దాన్ని ఆయన ఫన్నీగా ఫాల్ అవుట్ షెల్టర్ అంటాడు. ఆ తర్వాత ఫ్లైఓవర్ దాటుతుండగా, జనావాసాల మధ్యలో నుంచి దూసుకెళ్లే రైలు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది.


బస్సులో తిరుగు ప్రయాణం..

చివరగా, ఆయన తన ఆఫీస్ ఉన్న సిటీ స్క్వైర్ కు చేరుకుంటాడు. రెయిలింగ్ మీదుగా చూస్తుండగా, 22వ అంతస్తులో ఆయన ఆఫీస్ చతురస్రాకారంలో కనిపిస్తుంది. ఉరుకుల పరుగుల ప్రయాణం తర్వాత ఆయన ఆఫీస్ లో పని మొదలు పెడతాడు. ఆఫీస్ అయిపోయాక మళ్లీ తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. రిలాక్సింగ్ గా ఉండేందుకు ఆయన బస్సులో ప్రయాణిస్తాడు. తన రూట్ లో సబ్ వేలు చాలా ఎక్కువగా ఉంటాయని, అందుకే బస్సులో రిలాక్సింగ్ గా వెళ్తున్నట్లు చెప్పాడు. చివరకు తన అపార్ట్ మెంట్ కు చేరుకుంటాడు. ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలా ఉన్న ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఫన్నీగా కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు

ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. “ఆకాశ ప్రజల గురించి నేల మీద ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుంది” అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. “ఆయన జర్నీ వీడియో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీలా కనిపిస్తుంది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఈ వీడియో చూస్తుంటే నగరం భూమ్మీద కాకుండా ఆకాశంలో నిర్మించినట్లు కనిపిస్తుంది. అతడు భూమ్మీద ఉన్నత స్థాయిలో ఉన్నట్లు అనిపిస్తుంది” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సుమారు 13 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది.

Read Also: ఔనా, నిజమా.. ఇద్దరు వ్యక్తులు కలలో కమ్యునికేట్ చేసుకోవచ్చా? ఇవిగో ఆధారాలు

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×