E-Paper
Advertisement

Viral Video: రైలులో చిప్స్ పారేసిన 2 ఏళ్ల కొడుకు.. తండ్రి చేసిన పనికి.. నెట్టింట ప్రశంసలు!

Viral Video: రైలులో చిప్స్ పారేసిన 2 ఏళ్ల కొడుకు.. తండ్రి చేసిన పనికి.. నెట్టింట ప్రశంసలు!
Advertisement

Viral Video: రైళ్ల పరిశుభ్రతకు రైల్వేశాఖ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరి ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగా ఈ లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటికీ వందే భారత్ వంటి అధునాతన రైళ్లలోనూ అపరిశుభ్రమైన పరిస్థితులను అడపా దడపా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో ఓ తండ్రి తన కుమారుడి విషయంలో నడుచుకున్న తీరు.. ప్రశంసలు అందుకుంటోంది. రైలులో చిప్స్ పారేసిన కుమారుడితోనే దానిని పైకి ఎత్తించి పలువురికి ఆదర్శంగా నిలిచారు ఆ తండ్రి.

ట్రావెల్ వ్లాగర్ దీపక్ సమల్.. తన రెండేళ్ల కుమారుడితో కలిసి రైలు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో తండ్రి పక్కనే కూర్చున్న రెండేళ్ల కుమారుడు.. చిప్స్ తింటూ సరదాగా చిప్స్ ను నేలపై వెదజల్లాడు. శుభ్రంగా ఉన్న రైలు కాంపార్ట్ మెంట్ ను అపరిశుభ్రంగా మార్చాడు. అయితే దీపక్ తన బిడ్డ పారేసిన చిప్స్ ను తాను తీయాలని భావించలేదు. అలా చేస్తే తన బిడ్డకు చేసిన తప్పు గురించి తెలియదని అభిప్రాయపడ్డాడు. తన కుమారుడు చేసిన తప్పేంటో తెలియజెప్పేందుకు బిడ్డ చేతనే ఆ చిప్స్ నేల మీద నుంచి తీయించాడు.

Advertisement

చిప్స్ తీయంచడానికి ముందు కుమారుడితో దీపక్ మాట్లాడాడు. నేలపైన పడ్డ చిప్స్ ను ఎవరు శుభ్రం చేస్తారని ప్రశ్నించాడు. అప్పుడు పిల్లవాడు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు దీపక్ ప్రశాంతంగా మాట్లాడుతూ.. దానిని ఎలా తీయాలో పిల్లవాడికి చూపించాడు. ఇది మన ఇల్లు కాదని.. రైలు అంటే అందరి ఆస్తి అని కుమారుడికి తెలియజేశాడు. మన వల్ల రైల్లో అపరిశుభ్రత ఏర్పడితే ఇతరులకు ఇబ్బంది కలగకుండా దానిని మనమే శుభ్రం చేయాలని సున్నితంగా చెప్పాడు. తండ్రి మాటలను అర్థం చేసుకున్న రెండేళ్ల కుమారుడు.. తన చిట్టి చేతులతో చిప్స్ తీసివేయడం అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

Also Read: Upcoming ACs march 2026: మార్చిలో రాబోతున్న.. మోస్ట్ వాంటెడ్ ఏసీలు.. మిడిల్ క్లాస్‌కు పండుగే!

తన బిడ్డ చేత చిప్స్ తీయించిన వీడియోను దీపక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఏకంగా 1.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. బిడ్డ భవిష్యత్తును చాలా అందంగా, బాధ్యతాయుతంగా నిర్మిస్తున్నారని దీపక్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతీ ఒక్క తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటూ పేర్కొంటున్నారు. ప్రయాణికులు రైళ్లను తమవిగా భావిస్తే.. అపరిశుభ్రతకు చోటు ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Mini Fridges Feb 2026: రూ.10,000లోపు బడ్జెట్‌లో.. టాప్ ట్రెండింగ్ మినీ ఫ్రిడ్జ్‌లు.. క్రేజీ ఫీచర్లు భయ్యా!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×