Video Viral: వందల ఏళ్ల చరిత్ర కలిగిన వాటికి ప్రయార్టీ ఎక్కువగా ఇస్తుంటారు. అలాంటి 1500 ఏళ్ల చరిత్ర కలిసి దేవాలయం మంటల్లో మాడిమసైంది. అగ్నిప్రమాదం తర్వాత కాంక్రీట్ ఫ్రేమ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. అసలేం జరిగింది? ఎక్కడ అన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
పురాతన ఆలయం తగలబడింది
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ ఫేమస్ అయ్యింది. ఆ ప్రాంతంలో హిస్టారికల్ నేపథ్యం ఉన్న ఆలయాలు చాలానే ఉన్నాయి. జాంగ్జియాగాంగ్‌లో దాదాపు 1,500 ఏళ్ల పురాతన యోంగ్కింగ్ ఆలయంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటల్లో ఆలయం తగలబడిపోవడంపై అనుమానాలు మొదలయ్యాయి. సాంస్కృతిక వారసత్వం ఆనవాళ్లు కోల్పోవడంపై భయాందోళనలు తీవ్రమయ్యాయి.
శతాబ్దాల నాటి బౌద్ధ వాస్తుశిల్పం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది ఈ పురాతన ఆలయం. ఆలయంలో అలంకరించబడిన చెక్క పైకప్పులకు మంటలు అంటున్నాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేశారు.
1500 ఏళ్లు కలిగిన ఆలయం, కారణాలపై దర్యాప్తు
దాదాపు ఆరేడు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. వైరింగ్ లేదా దూపం వాడకం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. సదరన్ డైనాస్టీ కాలం నాటిది యోంగ్కింగ్ ఆలయం. జియాంగ్సులోని పురాతన ప్రదేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి.
ALSO READ: మంకీ డ్యాప్స్ ఎందుకు? డ్రైపర్లు ఉండగా చలికాలంలో క్రేజీ ఐడియా
పర్యాటకులను ఆకర్షిస్తున్న వాటిలో అది కూడా ఒకటి. వారసత్వ సంపద కోల్పోవడంతో స్థానికులను తీవ్ర విచారంలో ఉన్నారు. చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఆలయ నిర్మాణం చెక్కుచెదరకుండా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే పునరుద్ధరణ నెలల తరబడి పట్టవచ్చని అంటున్నారు. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం 536 ఏడాదిలో దక్షిణ లియాంగ్ రాజుల కాలంలో ఫెంగ్‌హువాంగ్ పర్వతంపై నిర్మించారు.
A #fire broke out at Yongqing Temple, a 1,500-year-old historic site in Zhangjiagang, #Jiangsu, on Nov 12. The blaze, reportedly in a replica ancient-style building, is now mostly under control with no casualties reported. #China pic.twitter.com/keTHVpXpp4
— Shanghai Daily (@shanghaidaily) November 12, 2025