కొందరు చేసే పనులను చూస్తే.. ఏం వాడకం గురూ అనాలపిపిస్తుంది. కొంత మంది అస్సలు ఊహించలేని పనులను చేస్తుంటారు. వాటిని చూసి జనాలు ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు షాకవుతారు కూడా. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఓ ఫ్యామిలీ చేసిన పని చూసి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఎందుకంటే.. వాళ్లు చేసిన పని అలా ఉంది. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే..
చలికాలంలో సాధారణంగా చలి నుంచి తప్పించుకునేందుకు మంకీ క్యాప్స్ పెట్టుకుంటారు. ఒక్కో మంకీ క్యాప్ ధర సుమారు రూ. 100 నుంచి రూ. 200 వరకు ఉంటుంది. అంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నాడు ఓ వ్యక్తి. తన ఇంట్లో ఉన్న డైపర్లను మంకీ క్యాప్ లుగా మార్చేశాడు. ఇంట్లోని నలుగురు వ్యక్తులు నాలుగు డైపర్లను తలలకు పెట్టేశాడు. చెవుల్లోకి గాలి వెళ్లకుండా చేశాడు. అంతేకాదు, ఈ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Also: జపాన్‌లో ఇళ్లన్నీ ఖాళీ.. ఫ్రీగా ఇచ్చేయడానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వం, మీకు కావాలా?
నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోలను చూసి నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది ఫన్నీగా కామెంట్స్ చేస్తే, మరికొంత మంది వారి ఆలోచనకు ఫిదా అవుతున్నారు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని కామెంట్స్ పెడుతున్నారు. “ఈ ఫోటోలు చూసి, నేను వాళ్ల తలలకు కట్లు కట్టుకున్నారు అనుకున్నాను” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “డైపర్లపై స్మెల్ నిరోధక, సెప్టిక్ నిరోధక ఏజెంట్స్ చల్లుతారు. అవి కాస్త కెమికల్ లక్షణాలతో ఉంటాయి. ఇలా పెట్టుకోవడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కెమికల్ రియాక్షన్ కు గురవుతారు” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “డైపర్ కంపెనీ వాళ్లు ఈ ఫోటోలు చూస్తే, వెంటనే వాటి ధర పెంచడం ఖాయం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “భారతీయుల ఆలోచనలు దేశ తలరాతను మార్చగలవు అనేందుకు ఇదో నిదర్శనం” అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. మొత్తంగా ఈ డైపర్ మంకీ క్యాప్ ఫోటోలపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.
Read Also: వాగు దాటలేక గ్రామస్తులు అవస్థలు.. ఏకంగా వంతెన కట్టేసిన యూట్యూబర్, మన రాష్ట్రంలోనే!