BigTV English

20 lakhs cash Air Throw: పెళ్లి ఊరేగింపులో నోట్ల వర్షం.. రూ.20 లక్షలు గాల్లో విసిరేసిన అతిథులు

20 lakhs cash Air Throw: పెళ్లి ఊరేగింపులో నోట్ల వర్షం.. రూ.20 లక్షలు గాల్లో విసిరేసిన అతిథులు

20 lakhs cash Air Throw| పెళ్లి అనగానే మన సమాజంలో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతోపాటు చాలామంది పెళ్లి సందర్భాలలో తమ వద్ద ఎంత ధనం ఉందో అందరికీ తెలియజేయడానికి విచిత్ర పద్ధతులు అనుసరిస్తుంటారు. ఖరీదైన బట్టలు, గాగుల్స్ కళ్లద్దాలు, కార్లు, బైకులను నలుగురిలో ప్రద్శిస్తూ తాము గొప్పవారమని చాటుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటిదే ఒక ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ వివాహ వేడుకలో వచ్చిన అతిథులు కార్లపై, ఇంటి పై కప్పులపై ఎక్కి లక్షల రూపాయల నోట్లు గాల్లో ఎగరేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని సిద్ధార్థనగర్ లో ఒక ధనిక ముస్లిం కుటుంబం వివాహ వేడుకలు నిర్వహించింది. దీంతో పెళ్లికి వచ్చిన అతిథులుగా బాగా డబ్బులు కలిగినవారే. పెళ్లిలో వరుడు ఊరేగింపు కార్యక్రమం కూడా జరిగింది. ఆ ఊరేగింపులో భాగంగా అతని స్నేహితులు, బంధువులు కార్లు, జెసీబీ బుల్ డోజర్లు తీసుకువచ్చారు. పట్టణంలో ఒక చౌరస్తా వద్ద ఊరేగింపు ఆపి జెసీబీలపై, సమీపంలోని ఇళ్లపై కప్పుల పైకి ఎక్కి వరుడి స్నేహితులు గాల్లోకి భారీగా నగదు విసిరేశారు. ఇదంతా పరిసరాల్లో నిలబడి చూసిన వారందరూ ఆ నోట్లను తీసుకనేందుకు పరుగులు తీశారు.

వీడియోలో పెట్టిన కామెంట్ ప్రకారం.. దాదాపు రూ.20 లక్షల రూ.100, రూ.200, రూ.500 నోట్లు గాల్లోకి విసిరేశారు. ఈ వివాహంలో వరుడి పేరు అఫ్జల్, పెళ్లి కూతరు పేరు అర్మాన్ గా తెలిసింది. ఇద్దరూ దేవల్‌హవా గ్రామానికి చెందినవారని సమాచారం.


Also Read: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!

ఈ వీడియో చూసి చాలా మంది నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. “ఈ డబ్బంతా పేదలకు పంచిపెడితే బాగుండేదేమో” అని యూజర్ కామెంట్ చేస్తే.. మరొకరు వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసుకి ఫోన్ చేయాల్సిందని జోక్ చేశారు.

ఇంకొక యూజర్ అయితే.. ఇంత డబ్బు నలుగురు పేదింటి అమ్మాయిల వివాహ ఖర్చులకు ఉపయోగపడుతుంది అని రాశాడు.

 

భార్యను బికినీలో చూడడానికి రూ.400 కోట్లు ఖర్చు పెట్టిన భర్త
ధనముంటే జీవితంలో దాదాపు అన్నీ సమకూరుతాయని అంటారు పెద్దలు. ఇది నిజం చేసి చూపించాడు. ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. గల్ఫ్ దేశానికి చెందిన ఒక అరబ్బు వ్యాపార వేత్త.. వంశపారంపర్యంగానే వేల కోట్ల ఆస్తిపరుడు. అయితే అతని భార్యకు బికినీ ధరించి.. సముద్ర తీరంలో విహరించాలని కోరిక కలిగింది.

కానీ ఇస్లాం మతం ప్రకరాం.. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో శరీరం నిండా వస్త్రాలు ధరించాలి. అందుకోసం ఆమె కోరిక తీరడం కష్టంగా మారింది. కానీ ఆమె భర్త తన భార్య కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్నాడు. అయితే తన భార్య బికినీ ధరిస్తే.. ఇతరులెవరూ చూడకూడదని భావించాడు. అందుకే సముద్ర తీరమున్న ఒక దీవిని మొత్తం కొనుగోలు చేసేశాడు. ఆ దీవిలో భార్యభర్తలిద్దరే వెళ్లారు. అక్కడ ఆమె తన భర్త ఎదుట బికినీ ధరించి సముద్ర తీరంలో జలకాలాడింది. కానీ ఇదంతా చేయడానికి ఆమె భర్త రూ.450 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ దీవిని కొనుగోలు చేసేందుకే అన్ని కోట్లు వెచ్చించాడు.

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×