BigTV English

Genitals Burn Flight: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!

Genitals Burn Flight: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!

Genitals Burn Flight| అమెరికాలో ఎంత చిన్న సమస్య అయినా కోర్టుకు వెళ్లవచ్చు. తప్పు ఎవరిదైనా విచారణ జరుగుతుంది. తాజాగా ఒక విమానంలో ప్రయాణం చేసిన వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్ కాలిపోయాయని.. అందుకు ఎయిర్ లైన్స్ కంపెనీనే కారణమని కేసు పెట్టాడు. తనకు రూ.1 కోటి 27 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని దావా వేశాడు.


వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన సీన్ మిల్లర్ అనే వ్యక్తి సౌత్ కెరోలినాలోని మిరిల్ బీచ్ నుంచి తన పెన్సిల్వేనియాలోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కు వెళ్లేందుకు ఫ్రంటియర్ ఎయిర్ లైన్స్ ద్వారా ప్రయాణించాడు. ఆ సమయంలో అతను విమాన సిబ్బందిని తన కోసం వేడిగా టీ కావాలని కోరాడు. దీంతో విమాన సిబ్బంది అతని టీ బ్యాగ్ తో పాటు కప్పులో వేడి వేడిగా మరుగుతున్న నీరుని తీసుకొచ్చి ఇచ్చారు. అయితే మిల్లర్ వాదన ప్రకారం.. విమాన సిబ్బంది వేడి నీటిని కప్పు నిండా తీసుకొచ్చారు. అయితే తన చేతికి అందించే క్రమంలో ఆ వేడి నీటితో నిండిన కప్పు ఒలికి అతని శరీరంపై పడింది. మిల్లర్ కూర్చున్న సీటు బెల్టు కూడా అదే సమయంలో స్ట్రక్ కావడంతో అతను అక్కడి నుంచి లేవలేకపోయాడు. నీరు వేడివేడి కాలిపోతుండడంతో అతని కడుపు, తొడలు, పురుషాంగం, వృషణాలు లాంటి భాగాలన్నీ కాలిపోయాయి.

Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!


దీంతో విమానం ల్యాండింగ్ చేసిన వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అతనికి వైద్య చికిత్స కోసం విపరీతం ఖర్చు అయింది. పైగా అతను ఉద్యోగానికి వెళ్లలేకపోయాడు. దీంతో మిల్లర్ తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని ఫ్రంటియర్ ఎయిర్ లైన్స్ పై కేసు వేశాడు. మిల్లర్ వైద్య ఖర్చులు, అతను ఉద్యోగానికి హాజరు కానందుకు అయిన జీత నష్టంతో పాటు అతను మానసికంగా అనుభవించిన క్షోభకు నష్టపరిహారంగా 150000 డాలర్లు ఇవ్వాలని మిల్లర్ అటార్నీ వాదించాడు.

విమాన సిబ్బంది నిర్లక్ష్యం, సీటు బెల్టు సరిగా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. అందుకే ప్రమాదానికి పూర్తి బాధ్యత ఫ్రంటియర్ విమాన సంస్థ వహించాలని మిల్లర్ తరపున లాయర్ వాదించాడు. ఈ కేసులో కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. కేసు విచారణలో ఉంది.

ఈజిప్ట్ ఎయిర్ లో కూడా ఇలాంటిదే ఘటన
అమెరికాలో జరిగిన వేడి నీటి ఘటన లాంటిదే ఈజిప్ట్ దేశంలో కూడా జరిగింది. ఈజిప్ట్ కు చెందిన 35 ఏళ్ల ఎస్రా హిజెయిన్ అనే మహిళ.. ఈజిప్ట్ ఎయిర్ ద్వారా ఫ్రిబవరి 2024లో ప్రయాణం చేసింది. అయితే విమాన ప్రయాణంలో ఆమె తనకు కాఫీ కావాలని అడిగింది. దీంతో విమాన సిబ్బంది ఒక మూత లేని కప్పులో వేడి వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది. విమానం గాల్లో ఒక్కసారిగా కదలడంతో ఆ వేడి వేడి కాఫీ ఎస్రా పై తొడ భాగంపై, ఆమె కడుపు భాగంపై పడింది ఈ కారణంగా ఆ భాగాలలో ఆమె చర్మం అంతా కాలిపోయింది. విమాన సంస్థ ఖర్చు మిగిల్చుకోవడం కోసం.. టీ, కాఫీ కప్పులకు మూత పెట్టకుండా సర్వీస్ చేసినందుకే ఈ ప్రమాదం జరిగిందని ఆమె లాయర్ వాదించారు. పైగా సీటు పక్కన ఉన్న ట్రే విరిగిపోయి ఉందని.. ఇదంతా ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని వాదించి నష్టపరిహారం కోరింది. కోర్టు ఆమెకు జరిగిన నష్టానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.

Related News

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Breaking News: కుప్పకూలిన మరో విమానం.. బూడిదైన శవాలు

Indian Army: అమెరికా చెప్పేదొకటి, చేసేదొకటి.. ట్రంప్ తీరుని ఎండగట్టిన ఇండియన్ ఆర్మీ

Trump on India: రష్యా నుంచి ఇండియా ఆయిల్ తీసుకుంటే.. ట్రంప్‌కు ఎందుకు మంట? కారణాలు ఇవే

Big Stories

×