Big Stories

Viral Video: కాలితో ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి.. వీడియో వైరల్

Ankit Soni: ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు కొందరు ఆసక్తి చూపించరు. కొందరు ఆఫీసులకు సెలవులు ఇచ్చినా ఓటు వేసేందుకు వెళ్లరు. కానీ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరునికి ఆయుధం లాంటిది. సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు కీలకమైంది. అయితే లోక్ సభ ఎన్నికల సందర్భంగా గుజరాత్ లో రెండు చేతులు లేని వ్యక్తి కాలితో ఓటు వేయగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

కొన్ని ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేస్తున్నారు. కానీ అక్కడక్కడా బాధ్యతతో ఉండాల్సి పౌరులు కూడా ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి చేతులు లేకపోయినా తన బాధ్యతను మరవ లేదు. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా మూడో దశ ఎన్నికల పోలింగ్ గుజరాత్ లో మంగళవారం మే 7 న జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓటు వేసిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో నిజంగానే ఎందరికో స్ఫూర్తినిస్తుంది.

- Advertisement -

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్ లోని నడియాడ్ లో అంకిత్ సోని అనే వ్యక్తి ఓటు వేసాడు. 20 ఏళ్ల క్రితం విద్యుత్ షాక్‌ తో అంకిత్ తన రెండు చేతులు కోల్పోయాడు. అయినప్పటికీ 20 ఏళ్లుగా తాను ఏనాడూ ఓటు వేయకుండా ఉండలేదని అంకిత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులతో అంకిత్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. చిత్తశుద్ధి ఉండాలే కాని వైకల్యం అడ్డురాదని అంకిత్ నిరూపించాడు.

Also Read: రియల్ కింగ్ కోబ్రాకు ఫ్యామిలీ రుద్రాభిషేకం.. కాటేసినా తగ్గేదే లే..

ఇదిలా ఉంటే అంకిత్ కాలితో ఓటు వేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల మనసును గెలుచుకుంటోంది. వీడియోను చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇలాంటి వారిని చూసైనా కనీసం ఓటు వేసేందుకు ముందుకు రావాలని అంటున్నారు. అంకిత్ ను ఆదర్శంగా తీసుకొని బాధ్యతగా ఓటు వేయాలని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News