BigTV English

Real Snake Worshiping : రియల్ కింగ్ కోబ్రాకు ఫ్యామిలీ రుద్రాభిషేకం.. కాటేసినా తగ్గేదే లే..

Real Snake Worshiping : రియల్ కింగ్ కోబ్రాకు ఫ్యామిలీ రుద్రాభిషేకం.. కాటేసినా తగ్గేదే లే..

Family Worshiping Real King Cobra : సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో వైరల్ అవుతోంది. మూడు రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో పోస్టైన ఆ వీడియోకు ఇప్పటికే 1 మిలియన్ పైగా లైకులొచ్చాయి. అయితే.. దీనిని భక్తి అనాలో, మూర్ఖత్వం అనాలో, అమాయకత్వం అనాలో అర్థం కావడం లేదంటున్నారు నెటిజన్లు.


నాగదోష పరిహారార్థం చాలా మంది ఆలయాల్లో పూజలు చేయించుకుంటారు. అయ్యవార్లు చెప్పినట్లుగా పూజలు చేస్తే.. దోషాలు పోతాయన్నది నమ్మకం. దానిని మూఢ నమ్మకంగా కొట్టిపారేయలేం. అయితే ఒక ఫ్యామిలీ మాత్రం ఏకంగా రియల్ నాగుపాముకే రుద్రాభిషేకం చేసింది. అది కాటేయడానికి వచ్చినా.. ఏ మాత్రం జంకు గొంకు లేకుండా పూజలు చేసింది.

Also Read : చివరి క్షణంలో పెళ్లికి నిరాకరించిన వరుడు.. కారణం తెలిసి అంతా షాక్ ( వైరల్ వీడియో)


నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఒక పాము పళ్లెంలో చుట్టుకుని, పడగ విప్పి ఉంది. దానికి దంపతులు పండితుడు చెప్పినట్లుగా పూజలు చేస్తున్నారు. మధ్యలో ఆ పాము వ్యక్తిపై దాడి చేసేందుకు ముందుకొచ్చింది. అయినా సరే.. తగ్గేదే లే అని యథావిధిగా దానికి పాలాభిషేకం చేయడం గమనార్హం. ఆ దంపతులు పూజ చేసినంత సమయమంతా ఆ నాగుపాము బుసలు కొడుతూనే ఉంది.

ఈ వీడియో కింద.. నాగదేవత – మహాదేవ్ ఆరాధనకు ప్రాముఖ్యత ఉందని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి రాసుకొచ్చాడు. వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మీకేమైనా పిచ్చా అని ఒకరంటే.. అది కాటు వేసి ఉంటే తర్వాతి పూజ మీకే జరిగేదని ఇంకొక యూజర్ కామెంట్ చేశారు. మరొకరు.. దుర్గాపూజ చేయాలంటే సింహాన్ని తీసుకొస్తారా అని అడిగారు. ఏదేమైనా.. రియల్ నాగుపాముకు అంతసాహసంతో పూజలు చేయడమంటే సామాన్యమైన విషయం కాదు కదా. దీనిని పిచ్చి అంటారో భక్తి అనుకుంటారో మీ ఇష్టం.

?utm_source=ig_web_copy_link">

?utm_source=ig_web_copy_link

 

Tags

Related News

Viral Video: ఆహా.. తందూరి రోటీలో బల్లి.. దోరగా వేగిపోయి.. కస్టమర్‌కు షాక్!

Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Bizarre Food: రసం రైస్.. ఐస్‌ఫ్రూట్, తినక్కర్లేదు.. ఏకంగా నాకేయొచ్చు!

Big Stories

×