Big Stories

Navaneet Kaur: తెలంగాణలో ఒకప్పటి హీరోయిన్ ప్రచారం

Navaneet Kaur Comments: పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలని బీజేపీ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇక్కడి నుంచి ఎక్కువ ఎంపీ సీట్లను గెలిచేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసింది.

- Advertisement -

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బీజేపీ నేతలను ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు పంపించి ప్రచారం చేయిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా పలువురు బీజేపీ జాతీయ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, అదేవిధంగా మాజీ గవర్నర్ తమిళి సై తెలంగాణలో ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అదేవిధంగా తెలుగువారికి అత్యంత సుపరిచితమైనటువంటి టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్, బీజేపీ సీనియర్ నేత నవనీత్ కౌర్ తెలంగాణలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

తెలంగాణలోని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్యధిక సీట్లు గెలిచి కేంద్రంలో ఈసారి కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లలో జహీరాబాద్ కూడా ఒకటి అని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీలను ప్రధాని మోదీ ఎంతో గౌరవిస్తారని ఆమె అన్నారు. అదేవిధంగా గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదేనని ఆమె అన్నారు.

Also Read: మాదిగలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తా: ప్రధాని మోదీ

అయితే, పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చేందుకు ఇటు బీజేపీ, ఇండియా కూటమి తీవ్రంగా పోటీ పడుతూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలంటూ బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇటు ఇండియా కూటమి కూడా ఎలాగైనా సరే అత్యధిక సీట్లు సాధించి మోదీని గద్దె దించాలని యోచిస్తుంది. కాగా, మొత్తం 543 ఎంపీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అయితే, తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తెలంగాణ నుంచి సాధించేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News