Harley’s India Cake Making: డిసెంబర్ వచ్చిందంటే చాలు.. రకరకాల బేకరీలు వెరైటీ వెరైటీ కేక్ లు తయారు చేస్తారు. భారీ పరిమాణంలో కేకులు రూపొందించి పలు బేకరీలు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి కూడా. హైదాబాద్ వేదికగా తయారైన కేకులు ఇప్పటికే పలు రికార్డులు సాధించాయి. తాజాగా మరో అరుదైన ఫీట్ కు భాగ్యనగరం రెడీ అవుతోంది. హార్లీస్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టార్గెట్ గా ఓ అపురూప దృశ్యాన్ని ఇవిష్కరించబోతోంది. ఏకంగా 3 టన్నుల రష్యన్ మెడోవిక్ హనీ కేక్ తయారు చేయబోతున్నట్లు హార్లీస్ ఇండియా ఫైన్ బేకింగ్ సిఈఓ సురేష్ నాయక్ తెలిపారు.
దుబాయ్ రికార్డును బ్రేక్ చేయనున్న హార్లీస్ ఇండియా
హార్లీస్ ఇండియా నైపుణ్యం, సృజనాత్మకతతో పాటు అత్యుత్తమమైన బేకింగ్ ఆవిష్కరణలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఈ కేక్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నది. స్వచ్ఛమైన తేనెతో తయారయ్యే ఈ కేకు ఏకంగా 3 టన్నులు ఉండబోతోంది. 7 ఫీట్ల వెడల్పు, 70 ఫీట్ల ఎత్తు ఈ భారీ కేక్ ను రెడీ చేయబోతున్నారు. గతంలో అదిపెద్ద కేక్ తయారు చేసిన కంపెనీగా స్పిన్నీస్ దుబాయ్ గిన్నీస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఆ కేక పరిమాణంతో పోల్చితే హార్లీస్ ఇండియా ఏకంగా 10 రెట్లు పెద్దగా రూపొందిస్తున్నది.
275 కిలోల హనీ కేక్ రూపొందించిన స్పిన్నీస్ దుబాయ్
ప్రపంచంలో అతిపెద్ద కేక్ ను రూపొందించిన కంపెనీగా ఇప్పటి వరకు స్పిన్సీస్ దుబాయ్ గుర్తింపు తెచ్చుకుంది. అయితే, అక్కడ ఈ కేకును తయారు చేసింది ఒడిశాకు చెందిన వ్యక్తి కావడం విశేషం. దుబాయ్‌లోని సూపర్ మార్కెట్ చైన్ స్పిన్నీస్ లో రఘునాథ్ పూర్ కు చెందిన ప్రీతం పట్నాయక్ చెఫ్ గా పని చేశాడు. తను 10 మంది స్టాఫ్ తో కలిసి ఈ కేక్ ను రూపొందించారు. ఆయన బృందం ఏకంగా 275 కిలోల హనీ కేక్ ను తయారు చేసింది. దీని పొడవు 4.8 మీటర్లు ఉండగా, వెడల్పు 1.08 మీటర్లు. ఈ కేక్ ను తయారు చేసేందుకు వాళ్లు మూడు రోజుల సమయం తీసుకున్నారు. ఈ కేక్ తయారీ కోసం ఎగ్స్, షుగర్, మైదా, వెన్న, తేనె, క్రీమ్ తో సహా సుమారు మూడు క్వింటాళ్ల పదార్థాలు ఉపయోగించారు. కేక్ తయారీ సమయం, భద్రతా ప్రమాణాలతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించిన తర్వాత గిన్నిస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకుంది.
మాయా కన్వెన్షన్ లో కేక్ తయారీ
ఇక హార్లీస్ ఇండియా స్పిన్సీస్ ఇండియా హనీ కేక్ తో పోల్చితే 10 రెట్లు పెద్ద కేక్ తయారు చేస్తుంది. 3 టన్నుల బరువు ఉండేలా రూపొందిస్తున్నది. డిసెంబర్ 6న హైదరాబాద్ లోని మాయా కన్వెన్షన్ సెంటర్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి కేక్ మేకింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పలు ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హార్లీస్ ఇండియా వెల్లడించింది. అటు బేకింగ్ ప్రదర్శనలు కూడా ఉంటాయని తెలిపింది. అటు హైదరాబాదీలు హార్లీస్ ఇండియాకు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: బాబోయ్.. ఒక్క టీ ధర లక్ష రూపాయలా? నెట్టింట వైరల్ అవుతున్న చాయ్ వీడియో!