BigTV English
Advertisement

Pushpa 2 Bookings: ఆ విషయంలో ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులు బ్రేక్ చేసిన ‘పుష్ప 2’.. బన్నీ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ

Pushpa 2 Bookings: ఆ విషయంలో ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులు బ్రేక్ చేసిన ‘పుష్ప 2’.. బన్నీ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ

Pushpa 2 Bookings: ఈరోజుల్లో తెలుగు ఇండస్ట్రీలోనే పాన్ ఇండియా సినిమాల మధ్య విపరీతంగా పోటీ మొదలయ్యింది. ఏ హీరోకు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, ఎవరి సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి లాంటి వాటి గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తూ ఉంటుంది. అందుకే ‘పుష్ప 2’ విడుదలయినప్పటి నుండి ఇతర హీరోల ఫ్యాన్స్ అంతా అసలు ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వస్తాయని ముందు నుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్ అవుతాయా అని ఎదురుచూస్తున్న సమయంలో ‘కల్కి 2898 ఏడీ’ రికార్డులను బ్రేక్ చేసింది ‘పుష్ప 2’. అది కూడా బుకింగ్స్ విషయంలోనే.


అంతకు మించి

‘పుష్ప 2’ బుకింగ్స్ విషయంలోనే ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రీమియర్ షో టికెట్ల విషయంలో ప్రేక్షకుల దగ్గర నుండి నెగిటివిటీ వచ్చినా చాలామంది ఈ టికెట్లను కొనుగోలు చేశారు. ప్రీమియర్స్ చూశారు. పైగా బుక్ మై షోలో ఓపెన్ చేసి చూస్తే ఎక్కడా ‘పుష్ప 2’ టికెట్లే దొరకడం లేదు. టికెట్లు దొరకడమే కష్టమయిపోయింది. మామూలుగా ప్రతీ పాన్ ఇండియా సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ‘బాహుబలి’ తర్వాత దాదాపు ప్రతీ ప్రభాస్ (Prabhas) సినిమాకు ఇదే జరుగుతూ వస్తోంది. తన చివరి మూవీ ‘కల్కి 2898 ఏడీ’ కూడా బుక్ మై షోలో టికెట్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయగా.. ‘పుష్ఫ 2’ ఆ రికార్డులను బ్రేక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.


Also Read: సుక్కు గారి చిక్కు ముడులు… పార్ట్ 3లో వీటికి సమాధానం వస్తుందా..?

ప్రభాస్ కంటే గొప్ప

‘పుష్ప 2’ (Pushpa 2) కోసం బుక్ మై షోలో గంటకు 97.74K టికెట్లు బుక్ అయ్యాయి. ఒకప్పుడు గంటకు ఎక్కువ టికెట్లు బుక్ అయిన రికార్డు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) పేరుపై ఉంది. ఇప్పుడు ‘పుష్ప 2’ ఆ రికార్డును లాగేసుకుంది. ఇంతకు ముందు ‘కల్కి 2898 ఏడీ’కి గంటకు 95.71K టికెట్లు బుక్ అయ్యాయి. అదే అప్పట్లో ఇండస్ట్రీ నిపుణులను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ‘పుష్ఫ 2’ బుకింగ్స్ చూస్తుంటే అందరూ మరింత షాకవుతున్నారు. దీంతో ప్రభాస్ రికార్డ్‌ను కొల్లగొడుతున్నట్టు అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తానికి ప్రభాస్ కంటే అల్లు అర్జునే నెంబర్ 1 అన్నట్టుగా ఫ్యాన్ వార్స్ మొదలుపెట్టారు. సినిమా ఈ రేంజ్‌లో రీచ్ సంపాదించుకున్నట్టుగా పండగ చేసుకుంటున్నారు.

అంతటా నెగిటివిటీ

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలను ఫ్యాన్స్ అంతా పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలామంది సినిమా బాలేదని నెగిటివిటీ వ్యాప్తించేలా చేస్తున్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఆ రివ్యూలను పట్టించుకోకుండా మూవీని థియేటర్లలో ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. మొత్తానికి ఈ మూవీ కలెక్షన్స్‌తో ఇప్పటివరకు ఉన్న తెలుగు సినిమా కలెక్షన్స్ రికార్డులు అన్నీ బ్రేక్ అవుతాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీలో సుకుమార్ డైరెక్షన్‌తో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్‌కు కూడా మంచి మార్కులే పడుతున్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×