TTD News: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేందుకు టీటీడీ ఎన్ని చర్యలు చేపడుతున్న.. ఏదో ఒక రీతిలో అన్యమత ప్రచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టి, తిరుమలలో అన్యమత ప్రచారం సాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల పలు వ్యాపార సముదాయాలను సైతం చైర్మన్ స్వయంగా పరిశీలించి పలు సూచనలు సైతం జారీ చేశారు. ఈ తరుణంలో అన్యమత ప్రచారానికి సంబంధించి గురువారం ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ తన కుటుంబంతో సహా వచ్చారు. అయితే తమ చిన్నారి కడియం కొనుగోలు చేయాలని మారాం చేయడంతో, వారు తిరుమలలోని వ్యాపార సముదాయం వద్దకు వెళ్లారు. అక్కడ కడియాన్ని కొనుగోలు చేసి, బస చేసిన రూమ్ వద్దకు చేరుకున్నారు.
ఈ దశలో కడియాన్ని వారు పరిశీలించగా, దానిపై అన్యమతం పేరు, గుర్తు ఉండడాన్ని గుర్తించి ఖంగుతిన్నారు. వెంటనే టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడుకు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. టీటీడీ అధికారులు సైతం స్పందించి వ్యాపార సముదాయాలను తనిఖీ చేశారు. కడియం విక్రయించిన షాపును సీజ్ చేసి, వ్యాపారస్తులకు పలు హెచ్చరికలు జారీ చేశారు.
తిరుమలలో అన్యమత ప్రచారం కట్టడికి టీటీడీ అన్నీ చర్యలు తీసుకుంటున్నా, ఇటువంటి ఘటనలు వెలుగులోకి రావడంతో చైర్మన్ సీరియస్ అయ్యారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని, వ్యాపార సముదాయాలను నిరంతరం తనిఖీ చేయాలని చైర్మన్ ఆదేశించారు. అలాగే అన్యమత ప్రచారానికి సంబంధించి కడియాలను, ఇతర సామాగ్రిని విక్రయిస్తున్న వ్యాపార సముదాయాలను గుర్తించే పనిలో టీటీడీ విజిలెన్స్ విభాగం నిమగ్నమైంది.
Also Read: AP Schools: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై సూపర్ టెక్నాలజీ తరగతులు..
ఫిర్యాదు ఇచ్చిన వెంటనే టీటీడీ అధికారులు స్పందించడం పై ఫిర్యాదు చేసిన భక్తుడు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇటీవల పలువురు తిరుమల పరిసర ప్రాంతాలలో రీల్స్ చేసి వైరల్ కాగా, తక్షణం జరిగిన పొరపాటును గుర్తించిన వారు క్షమాపణలు చెబుతూ వీడియోలను విడుదల చేశారు. ఇలా వివాదాస్పద రీల్స్ చేసేవారిని గుర్తించి, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.
తిరుమలలో అన్యమత ప్రచారం..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్ కు చెందిన శ్రీధర్ కుటుంబం
పిల్లాడి కోసం స్టీల్ కడియం కొనుగోలు చేసిన శ్రీధర్
రూమ్ కి వెళ్లిన తర్వాత కడియాన్ని చూడగా.. దానిపై అన్యమతం పేరు, గుర్తు కనిపించడంతో షాక్
టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన భక్తుడు… pic.twitter.com/K7vvxVURBB
— BIG TV Breaking News (@bigtvtelugu) December 5, 2024