Dubai cafe’s ‘Karak Gold’ Chai: మనం రోజూ చాయ్ తాగుతాం. ఫ్రెండ్స్ తో కలిసి టీ స్టాల్ దగ్గర లేదంటే కేఫ్ లో వేడి వేడి చాయ్ రుచి చూస్తాం. ఒక టీ ధర మామూలుగా రూ. 10 ఉంటుంది. లేదంటే రూ. 20 ఉంటుంది. ఒకవేళ ఫైవ్ స్టార్ హోటల్లో అయితే, ఇంచుమించు రూ. 500 వరకు ఉంటుంది. కానీ, ఒక్క టీ ధర రూ. లక్ష ఉండటం ఎప్పుడైనా గమనించారా? వినడానికే షాకింగ్ గా ఉన్నా.. ఇది నిజం. దుబాయ్ లోని ఓ కేఫే లో ఒక్కో టీకి అక్షరాలా రూ. లక్ష తీసుకుంటున్నారు. ఇంతకీ అంత ధర పలికే ఆ టీ ప్రత్యేకత ఏంటో తెలుసా..
భారత సంతతి మహిళ నడుపుతున్న బొహో కెఫే
ఒక్క టీ ధర రూ. లక్ష పలికే కేఫే దుబాయ్ లో ఉంది. ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ లో ఉన్న ఈ కేఫేను భారత సంతతికి చెందిన సుచేత శర్మ రన్ చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా ‘గోల్డ్ కడక్’ చాయ్ అమ్ముతున్నారు. ఈ చాయ్ మీద 24 క్యారెట్స్ తో కూడిన బంగారు పూతను పూస్తారు. చాయ్ తో పాటు తినడానికి బంగారం చల్లిన క్రోసెంట్ కూడా ఇస్తారు. అంతేకాదు, వేడి వేడి చాయ్ ని వెండి కప్పులో పోసి, వెండి సాసర్ తో తెచ్చి ఇస్తారు. వెండి కప్పు, సాసర్ ను తాగిన వాళ్లు తీసుకుపోవచ్చు. తాజాగా ఈ ‘గోల్డ్ కడక్’ టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: తాళ్లు పెట్టి పట్టాలు లాగేసిన యువకులు, నెట్టింట వీడియో వైరల్
సోషల్ మీడియాలో నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఇక ఈ ‘గోల్డ్ కడక్’ టీ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతుంటే, మరికొంత మంది అది మనతో అయ్యే పని కాదులే అని కామెంట్స్ చేస్తున్నారు. “చాయ్ తాగడానికి ఈఎంఐ ఆప్షన్ ఉందా?” అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. “ఐ ఫోన్ మీద ఈఎంఐ ఆప్షన్ ఇచ్చినప్పుడు, ఈ టీ తాగేందుకు కూడా ఈఎంఐ ఆప్షన్ ఇవ్వాల్సిందే” అని మరో వ్యక్తి రియాక్ట్ అయ్యారు. “ఒకవేళ ఈ టీ తాగేందుకు దుబాయ్ కి వెళ్తే కస్టమ్స్ ఛార్జీ చెల్లించాలా? అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “బంగారం మెడలో వేసుకునేందుకు బాగుంటుంది. తాగడం ఏంటండీ?” అని ఇంకో నెటిజన్ స్పందించాడు. “జీవితంలో ఒక్కసారైనా ఈ టీ తాగాలి” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ‘గోల్డ్ కడక్’ చాయ్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ ప్రియులను ఈ చాయ్ ఆకట్టుకుంటున్నది.
Read Also: కోతి పడింది.. కారు టాప్ పగిలింది.. సోషల్ మీడియాలో వీడియో వైరల్