BigTV English

Haryana Costly Buffalo: 1500 కేజీల బర్రె.. రోజూ డ్రై ఫ్రూట్స్, 20 గుడ్లు, 30 అరటి పండ్లు ఆహారం.. ధర రూ.23 కోట్లు

Haryana Costly Buffalo: 1500 కేజీల బర్రె.. రోజూ డ్రై ఫ్రూట్స్, 20 గుడ్లు, 30 అరటి పండ్లు ఆహారం.. ధర రూ.23 కోట్లు

Haryana Costly Buffalo| హర్యాణాకు చెందిన ఒక బర్రె ధర ఏకంగా రూ.23 కోట్లు. ఇది విని మీ కళ్లు తేలిపోతున్నాయా?. అయితే ఈ బర్రె అంత ప్రత్యేకం మరి. దేశ వ్యాప్తంగా వ్యవసాయ ఉత్సవాల్లో దీన్ని ప్రదర్శన జరుగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. హర్యాణా రాష్ట్రంలోని సిర్సా నగరానికి చెందిన అన్మోల్ అనే మగజాతి బర్రె 1500 కిలోలు బరువు ఉంటుంది.


అన్మోల్ గెదెని దాని ఓనర్ గిల్ ఇప్పటికే రాజస్థాన్ లోని పుష్కర్ మేలా, మీరట్ లో జరిగిన ఆలిండియా రైతుల ఉత్సవం లోతో పాటు పలు ఉత్సవాల్లో ప్రదర్శించాడు. భారీ ఆకారం, హై క్వాలిటీ పెంపకం, మేలు జాతి గేదె కావడంతో అన్మోల్ బర్రె చాలా ఫేమస్. సోషల్ మీడియాలో కూడా అన్మోల్ హర్యాణా బఫెలో అంటే ఒక సెన్సేషన్. చాలా ప్రదర్శనల్లో దీన్ని చూసి చాలా మంది కొనుగోలు చేయాలని దీని యజమాని గిల్ ‌కు భారీ ఆఫర్లు ఇచ్చారు. ఒక ప్రదర్శనలో అయితే కొందరు అన్మోల్ ని కొనేందుకుక పోటీ పడ్డారు. ఆ పోటీలో దీని ధర ఏకంగా రూ.23 కోట్ల వరకు పలికింది. అందుకే అన్మోల్ భారతదేశంలోనే అత్యం ఖరీదైన బర్రెగా రికార్డు సృష్టించింది.

Also Read: ఏడాది సంపాదన ఒక్కనెలలోనే.. అందాలతో వ్యాపారం చేసే ఎయిర్ హోస్టెస్!


అన్మోల్ ధరతో రెండు రోల్స్ రాయ్స్ కార్లు, లేదా పది లగ్జరీ మర్సిడీజ్ బెంజ్ కార్లు కొనుగోలు చేయొచ్చు. రూ.23 కోట్లంటే దేశంలోనే ఖరీదైన ప్రాంతం నోయిడాలో 20 విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేయొచ్చు. అన్మోల్ ధర గురించి తెలిసి చాలా మంది దీన్ని చూడడానికి బారులు తీరుతున్నారు.

అయితే అన్మోల్ ఇంత ధర పలకడానికి కారణాలు కూడా ఉన్నారు. దీని పెంపకం చాలా ఖర్చుతో కూడుకున్నది. దీని ఆహారం కోసమే యజమాని గిల్ ప్రతి రోజు రూ.1500 ఖర్చు పెడుతున్నాడు. నిత్యం దీనికి మేతగా డ్రై ఫ్రూట్స్ మిక్స్ తినిపిస్తారు. అందులో 250 గ్రాముల బాదాం పప్పు తప్పనిసరి. వీటికి తోడుగా 30 అరటి పండ్లు, 4 కిలోల దానిమ్మ, 5 లీటర్ల పాలు, 20 కోడి గుడ్లు ఉంటాయి. దీని కోసం ప్రత్యేకంగా గిల్ ఆయిల్ కేక్ తయారు చేయిస్తారు. సాధారణంగా బర్రెలకు పెట్టే పచ్చ గ్రాసంతో పాటు అన్మోల్ నేయి, సోయాబీన్స్, మొక్కజొన్న లాంటివి కూడా తింటుంది. ఇవన్నీ తినిపించడం కారణంగా అన్మోల్ పూర్తి ఆరోగ్యంతో దిట్టగా కనిపిస్తుంది.

అన్మోల్ ఆరోగ్యం కోసం ఇద్దరు వర్కర్లు కూడా పనిచేస్తున్నారు. ప్రతిరోజు దీన్ని బాదం, ఆవాల నూను ఆయిల్ తో మసాజ్ చేయడం, నిత్యం దీనికి స్నానం చేయించడంతో అన్మోల్ చర్మం నిగనిగ లాడిపోతూ ఉంటుంది. అయితే దీన్ని పోషిస్తున్న గిల్ ఒక సాధారణ రైతు అనే చెప్పాలి. గతంలో అన్మోల్ ని పోషించడానికి డబ్బులు లేక.. దీని తల్లి, సోదరిని విక్రయించేశాడు. అన్మోల్ తల్లి కూడా ప్రతిరోజు 25 లీటర్ల పాలు ఇచ్చేది.

అయితే ఇప్పుడు అన్మోల్ ఆరోగ్యం చూసి చాలామంది పాడి రైతులు దీని వీర్యాన్ని వేలు, లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వారంలో అన్మోల్ నుంచి రెండు సార్లు వీర్యం తీస్తారు. దీని వీర్యానికి అంత డిమాండ్ మరి. ఒక్కసారి తీసిన వీర్యంతో వందల గేదెలు పుట్టించవచ్చు అని గిల్ తెలిపారు. ప్రతినెలా దీని వీర్యంతో రూ.4 నుంచి రూ.5 లక్షల దాకా సంపాదన వస్తోందని ఆయన చెప్పాడు. ఆ ఆదాయంతోనే తాను అన్మోల్ పోషణ చేయగలుగుతున్నానని అన్నాడు. అయితే ఎంతమంది వచ్చి అన్మోల్ ని విక్రయించేయాలని చెప్పినా గిల్ అందుకు అంగీకరించడం లేదు. అన్మోల్ తన కుటుంబంలో ఒక జీవిగా భావిస్తున్నట్లు చెప్పాడు. తనకు అన్మోల్ ని విక్రయించే ఉద్దేశం లేదని అన్నాడు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×